మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు నెలలో శ్రీకాళహస్తిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్వయంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇందులో ఆయన ఓ కీలక పాత్ర కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. శివ భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హిందీ మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ మంచి విష్ణు డ్రీం ప్రాజెక్టు 'కన్నప్ప'ను తెరకెక్కిస్తున్నారు.
ఈ ప్రాజెక్టులో పాన్ ఇండియా హీరో ప్రభాస్ సైతం ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. రీసెంట్‌గా జరిగిన పూజా కార్యక్రమాలకు కూడా నుపుర్ సనన్ హాజరయ్యారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా తెలియజేశారు.
ఈ మేరకు తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "దురదృష్టం. లవ్లీ లేడీ నుపుర్ సనన్ కన్నప్ప ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. మరొక హీరోయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. షెడ్యూల్స్ కి నుపుర్ సనన్ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడమే కారణం. ఆమె ఇతర ప్రాజెక్టుకి ఆల్ ది బెస్ట్" అని తన ట్వీట్ లో పేర్కొన్నారు మంచు విష్ణు. దీంతో ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో నుపుర్ సనన్ స్థానంలో ఏ హీరోయిన్ ని మేకర్స్ ఫైనల్ చేస్తారనేది చూడాలి. రవితేజ నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరావు' సినిమాతో నుపుర్ సనన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
మరోవైపు 'కన్నప్ప'లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నారనే విషయంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే కనుక నిజమైతే కన్నప్ప సినిమాకు ఇది చాలా ప్లస్ అవుతుందని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మంచి విష్ణు మార్కెట్ పూర్తిగా డౌన్ ఫాల్ లో ఉంది. కాబట్టి మంచి విష్ణు హీరోగా నటించే కన్నప్పలో ప్రభాస్ నటిస్తే ఖచ్చితంగా ప్రభాస్ క్రేజ్ తో ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది.
నిజానికి ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు హీరోగా బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన 'భక్తకన్నప్ప' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని రీమేక్ చేయాలన్నది ప్రభాస్ చిరకాల కోరిక. అప్పట్లో తన పెద్ద నాన్నతో కలిసి ఈ ప్రాజెక్ట్ చేయాలని డార్లింగ్ ప్రయత్నించినా అది కుదరలేదు. కృష్ణంరాజు కూడా ప్రభాస్ ను భక్తకన్నప్పగా చూడాలని అనుకున్నారు, కానీ అది జరగలేదు. మరి నిజంగానే ప్రభాస్ కన్నప్పలో శివుడిగా నటిస్తున్నాడా? అనేది తెలియాలంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.
Also Read : యాంకర్ మెడలో దండేసిన నటుడు, వెంటనే ఆమె ఆ దండ తీసి ఏం చేసిందో చూడండి