క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ (Krishna Vamsi) దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). 'మన అమ్మానాన్నల కథ'... అనేది ఉపశీర్షిక. ఉగాదికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సినిమా విడుదల తేదీని వెల్లడించారు.
మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం!Rangamarthanda Release Date : ''ఉగాది శుభాకాంక్షలతో... ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం. ఆ రోజే థియేటర్లలో సినిమా విడుదల'' అని కృష్ణవంశీ వెల్లడించారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజ్య శ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, వెంకట్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. కొన్ని రోజులుగా హైదరాబాదులో సినిమా ప్రివ్యూలు వేస్తున్నారు. చాలా మంది దర్శకులు సినిమా చూశారు. అద్భుతమని పొగిడారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటన మీద ప్రశంసలు కురిపించారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ 'రంగమార్తాండ' థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మైత్రి డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా విడుదల కానుంది. సంక్రాంతి సినిమాలు 'వీర సింహా రెడ్డి', 'వాల్తేరు వీరయ్య'తో మైత్రి డిస్ట్రిబ్యూషన్ మొదలైన సంగతి తెలిసిందే. 'కోనసీమ థగ్స్' సినిమా కూడా విడుదల చేసింది.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు రాయగా... లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. లక్ష్మీ భూపాల రాసిన షాయరీకి చిరంజీవి తన గళం అందించారు.
Also Read : శృతి హాసన్ మందు కొట్టి ఆరేళ్ళ - బీర్ కూడా నాన్ ఆల్కహాలిక్ అయితేనే
చిరంజీవి షాయరీలో ఏముంది? అనేది చూస్తే...''నేనొక నటుడ్నిచమ్కీల బట్టలేసుకునిఅట్ట కిరీటం పెట్టుకునిచెక్క కత్తి పట్టుకునికాగితపు పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసేచక్రవర్తిని నేనుకాలాన్ని బంధించి శాసించే నియంతను నేను
నేనొక నటుడ్నినాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్నినేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్నివేషం కడితే అన్ని మతాల దేవుడ్నివేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని
నేనొక నటుడ్నినవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తానుహరివిల్లుకు ఇంకో రెండు రంగులేసి నవరసాలూ మీకిస్తానునేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను
నేనొక నటుడ్నిజగానికి జన్మిస్తానుసగానికి జీవిస్తానుయుగాలకు మరణిస్తానుపోయినా బ్రతికుంటాను
నేనొక నటుడ్నిలేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్నిఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్నిఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మినిఅసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని
నేనొక నటుడ్నిగతానికి వారధి నేనువర్తమాన సారథి నేనురాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేనుపూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను
నేనొక నటుడ్నిపిడుగుల కంఠాన్ని నేనుఅడుగుల సింహాన్ని నేనునరం నరం నాట్యమాడే నటరాజు రూపాన్ని నేనుప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేనుప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండుడ్ని నేను
నేనొక నటుడ్నిఅసలు మొహం పోగొట్టుకున్న అమాయకుడ్నికానీ 9 తలలు ఉన్న నటరావణుడ్నినింగి, నేల రెండు అడుగులైతేమూడో పాదం మీ మనసుల మీద మోపే వామనుడ్నిమీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్నిసంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని
నేనొక నటుడ్నిఅప్సరసల ఇంద్రుడ్నిఅందుబాటు చంద్రుడ్నిఅభిమానుల దాసుడ్నిఅందరికీ ఆప్తుడ్ని
చప్పట్లను భోంచేస్తూఈలలను శ్వాసిస్తూఅనుక్షణం జీవించే అల్పసంతోషిని నేనుమహా అదృష్టవంతుడ్ని నేనుతీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించేసగటు కళాకారుడ్ని నేను
ఆఖరి శ్వాస వరకూ నటనే ఆశ నాకునటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు''