Tollywood Latest Drug Case : ముందు 'బిగ్ బాస్' అషు రెడ్డి, ఆ తర్వాత నటి జ్యోతి... ఇప్పుడు సురేఖా వాణి (Surekha Vani)! ఒక్కొక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు. డ్రగ్స్ కేసుతో తమకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. సురేఖా వాణి సైతం ఓ వీడియో విడుదల చేశారు. 


మాకు ఎటువంటి సంబంధం లేదు!
అసలు, డ్రగ్స్ కేసు వివరాల్లోకి వెళితే... ఈ నెల 13వ తేదీన నిర్మాత కేపీ చౌదరి అలియాస్ కృష్ణప్రసాద్ చౌదరి (KP Chowdary)ను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. తొలుత ఆయన డ్రగ్స్ వాడుతున్నారనే అనుమానంతో దాడులు చేయగా... తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొంత మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి వెల్లడించినట్లు సమాచారం. పోలీసుల విచారణలో కొంత మంది నటీమణులతో వందల సార్లు కేపీ ఫోన్ మాట్లాడినట్లు గురించారని వార్తలు వచ్చాయి. 


అషు రెడ్డి, నటి జ్యోతి, ప్రముఖ ఆర్టిస్ట్ సురేఖా వాణి నంబర్లు కేపీ చౌదరి ఫోనులో ఉన్నాయని, వాళ్ళతో ఆయన వందల సార్లు మాట్లాడారని బలంగా వినబడుతోంది. ముఖ్యంగా గోవాలో కేపీ చౌదరి పార్టీలకు కుమార్తెతో సహా సురేఖా వాణి వెళ్లారని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో సురేఖా వాణి వివరణ ఇచ్చారు. 


''హలో అండీ... అందరికీ నమస్కారం! గత కొంత కాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు, మాకు ఎటువంటి సంబంధం లేదు. దయ ఉంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి! మీరు చేస్తున్న ఆరోపణల వల్ల మా కెరీర్, మా ఫ్యూచర్, మా పిల్లల కెరీర్, కుటుంబాలు, ఆరోగ్యం... అన్ని రకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి'' అని సురేఖా వాణి వీడియో విడుదల చేశారు. అందులో ఎక్కడ కేపీ చౌదరి పేరు ప్రస్తావించలేదు. కేసుతో సంబంధం లేదని, ఆయన పేరు తీయడం కూడా ఇష్టం లేదని ఆమె పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది.


Also Read : ఐదేళ్ళ పాటు 'దిల్' రాజును ఆదుకున్న పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ'



అమ్మాయిల ఫొటోలే ఎందుకు?
మరి, అబ్బాయిల ఫోటోలు ఎక్కడ?
మీడియాలో, ముఖ్యంగా న్యూస్ ఛానళ్లలో తన ఫోటోలు రావడం పట్ల నటి జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిల ఫోటోలు ఎందుకు పబ్లిష్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అమ్మాయిలు ఈజీ టార్గెట్ అయ్యారా? అబ్బాయిల ఫోటోలు ఎందుకు వేయడం లేదు? అని జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. 


కేపీ చౌదరి తనకు స్నేహితుడు అని జ్యోతి అంగీకరించారు. అదే సమయంలో కేపీ డ్రగ్స్ కేసుకు, తనకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తాను ఎప్పుడూ డ్రగ్స్ పార్టీలకు వెళ్ళలేదని, అవసరం అయితే నార్కోటిక్ టెస్ట్ చేయించుకోవడానికి రెడీగా ఉన్నానని, విచారణలో పోలీసులకు సహకరించడానికి సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. అషు రెడ్డి సైతం తన ఫోన్ నంబర్ బయట పెట్టడం పద్ధతి కాదంటూ ఓ వివరణ విడుదల చేశారు. తనకు డ్రగ్స్ కేసుతో ఎటువంటి సంబంధం లేదన్నారు. 


Also Read : ప్రభాస్‌ సినిమాలో కమల్ హాసన్ - కన్ఫర్మ్ చేసిన 'ప్రాజెక్ట్ కె' టీమ్


ప్రముఖ నిర్మాత 'ఠాగూర్' మధుతో పాటు బెజవాడ భరత్, తేజ, రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, శ్వేత తదితరులు డ్రగ్స్ కొన్నట్లు కేపీ చౌదరి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే... వాళ్ళు ఇంకా స్పందించలేదు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial