శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో రాహుల్ విజయ్ హీరో. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని హీరోయిన్.  


మలయాళ హిట్ 'నాయట్టు'కు రీమేక్! 
'కోట బొమ్మాళి పీఎస్' చిత్రానికి తేజ మార్ని దర్శకత్వం వహించారు. విమర్శకులతో పాటు వీక్షకుల ప్రశంసలు అందుకున్న 'జోహార్'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆహా ఓటీటీలో ఆ సినిమా విడుదలైంది. ఆ తర్వాత శ్రీవిష్ణు హీరోగా 'అర్జున ఫాల్గుణ' తీశారు. మలయాళ హిట్ 'నాయట్టు'కు స్ఫూర్తితో 'కోట బొమ్మాళి పీఎస్'కు దర్శకత్వం వహించారు.


'కోట బొమ్మాళి పీఎస్'ను జీఏ2 పిక్చర్స్ పతాకంపై 'బన్నీ' వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతి రోజు పండగే', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాలను నిర్మించింది ఈ సంస్థే. ఇప్పుడీ 'కోట బొమ్మాళి పీఎస్' సినిమాను నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఆ రోజు మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఆదికేశవ' కూడా విడుదల కానుంది. 


Also Read వైష్ణవ్ తేజ్, శ్రీ లీల సినిమాపై వరల్డ్ కప్ ఎఫెక్ట్ - దీపావళి బాక్సాఫీస్ బరిలో నుంచి వెనక్కి వెళ్లిన 'ఆదికేశవ'






'లింగి లింగి లింగిడి...'కి సూపర్ రెస్పాన్స్!
'కోట బొమ్మాళి పీఎస్' సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన 'లింగి లింగి లింగిడి' అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని కోట్ల వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


Also Read మాటల్లేవ్ - విక్రమ్ 'తంగలాన్' టీజర్, ఆ యాక్షన్ చూశారా?



శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు: తేజ మార్ని, నిర్మాణం : GA2 పిక్చర్స్, నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి, సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి, ఛాయాగ్రహణం : జగదీష్ చీకటి, మాటలు : నాగేంద్ర కాశి, కూర్పు : కార్తీక శ్రీనివాస్ ఆర్, కళా దర్శకత్వం : గాంధీ నడికుడికర్, సంగీతం : రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అజయ్ గద్దె, కాస్ట్యూమ్ డిజైనర్ : అపూర్వ రెడ్డి.