Vijay Sethupathi Takes Over Balakrishna Role Rajinikanth Jailer 2 Movie : తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో రాబోతోన్న అవెయిటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జైలర్ 2'. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... వచ్చే ఏడాది జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది.
బాలకృష్ణ ప్లేస్‌లో స్టార్ హీరో?
2023లో వచ్చిన 'జైలర్'కు సీక్వెల్‌గా మూవీ రూపొందుతుండగా... ఇందులో బాలకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం అప్పట్లో సాగింది. అయితే, ఇప్పుడు ఆయన స్థానంలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయితే, 'జైలర్ 2'లో ఈ రోల్ కోసం బాలయ్యనే తీసుకోవాలని అనుకున్నట్లు డైరెక్టర్ నెల్సన్ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆయన ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని పవర్ ఫుల్‌గా ఆ పాత్రను తీర్చిదిద్దలేకపోవడంతో అడుగులు ముందుకు పడలేదని చెప్పారు. ఈ క్రమంలోనే మరో స్టార్ హీరో ఎవరైనా ఆ రోల్‌లో కనిపిస్తారనే ప్రచారం సాగింది. ఎవరూ ఊహించిన విధంగా ఇప్పుడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి పేరు వినిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి దీనిపై మూవీ టీం రియాక్ట్ కావాల్సి ఉంది.
Also Read : 'అఖండ 2' సెన్సార్ రివ్యూ - బాలయ్య రుద్ర తాండవం సరే... మూవీలో హైలెట్స్ ఏంటో తెలుసా!
'జైలర్'లో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీ అదరగొట్టారు. ఇప్పుడు మరోసారి అదే రోల్‌లో ఆయన కనిపించనుండగా... ఆయన భార్యగా రమ్యకృష్ణ కీ రోల్ ప్లే చేశారు. కరుణాడ చక్రవర్తి శివరాజ్ కుమార్, మలయాళ స్టార్ మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, మిర్నా మేనన్, వినాయకన్ వంటి స్టార్స్ కూడా కీలక పాత్రలు పోషించారు. సీక్వెల్‌లోనూ వీరు కొనసాగనున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. సీక్వెల్‌లో కొత్త రోల్స్ యాడ్ కానుండగా అందులో విజయ్ సేతుపతి పాత్ర కీలకం అని తెలుస్తోంది.
ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా... అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్‌ను మించి భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ఓ విగ్రహాల చోరీ ముఠా వల్ల ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి?, వారి నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ క్రమంలో ఆయనకు తెలిసిన షాకింగ్ నిజం వంటివి ఫస్ట్ పార్ట్‌లో చూపించారు. ఇప్పుడు సీక్వెల్ మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కనుంది. వచ్చే ఏడాది జూన్ 12న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.