Balakrishna's Akhanda 2 Censor First Review : గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డివోషనల్ టచ్ హై రేంజ్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2' పండుగకు టైం దగ్గర పడింది. డిసెంబర్ 5న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుండగా సెన్సార్ రివ్యూ వచ్చేసింది.
బాలయ్య 'అఖండ' రుద్ర తాండవం
2021లో వచ్చిన 'అఖండ'కు సీక్వెల్‌గా 'అఖండ 2 తాండవం' తెరకెక్కించగా... ఫస్ట్ పార్ట్‌ను మించేలా పేరుకు తగ్గట్లుగానే బాలయ్య అఖండ రుద్ర 'తాండవం'ను సిల్వర్ స్క్రీన్‌పై చూపించినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ 'U/A' సర్టిఫికెట్ ఇవ్వగా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ మూవీ నుంచి ఎంజాయ్ చెయ్యొచ్చని సెన్సార్ సభ్యులు తెలిపారు. భారతీయ సంస్కృతి, సనాతన హిందూ ధర్మ పరిరక్షణ, మంచు కొండల్లో మహాశివుని రుద్ర తాండవాన్ని అద్భుతంగా చూపించారనే టాక్ వినిపిస్తోంది.
ఓ వైపు సనాతన ధర్మం, ఆలయాల గొప్పతనం, శివ క్షేత్ర మహిమల గురించి చెబుతూనే ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా మాస్ అంశాలను జోడించినట్లు టాక్ వినిపిస్తోంది. తమన్ బీజీఎం వింటే నిజంగా థియేటర్స్ దద్దరిల్లడం ఖాయమని సెన్సార్ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. మొత్తానికి బాలయ్య మాస్సివ్ తాండవంను మళ్లీ వెండితెరపై చూడబోతున్నట్లు కన్ఫర్మ్ అవుతోంది. 'డిసెంబర్ 5 నుంచి తాండవం ప్రపంచాన్ని పాలిస్తుంది.' అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్
Also Read : డార్లింగ్ ప్రభాస్ షాకింగ్ డెసిషన్! - సందీప్ వంగా కండీషన్‌కు ఓకే చెప్పేశారా?... ఆ ప్రచారంలో నిజమెంత?
ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ టీజర్స్, ట్రైలర్స్‌తో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎలివేషన్స్, బీజీఎం, విజువల్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. రికార్డులు కన్ఫర్మ్ అని అయితే సరికొత్త రికార్డుల కోసమే వెయిటింగ్ అంటూ బాలయ్య ఫ్యాన్స్ హడావుడి చేస్తున్నారు. హిమాలయాల్లో అఘోరగా బాలయ్య రుద్ర తాండవం ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ థ్రిల్ డబుల్ చేసేలా మూవీని 3D ఫార్మాట్‌లోనూ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
మూవీలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేస్తున్నారు. మురళీకృష్ణ పాత్రలో మాస్ రోల్, అఘోరగా డ్యూయల్ పాత్రల్లో కనిపించనున్నారు. ఆది పినిశెట్టి విలన్ రోల్ చేయగా... పూర్ణ, హర్షాలి మెహతా కీలక పాత్రలు పోషించారు. బాలయ్య కుమార్తె తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ అచంట, గోపీచంద్ అచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఫ్యాన్స్ సందడికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.