Ranveer Singh Draws Blacklash As He Imitates Rishab Shetty Kantara Scene : కన్నడ స్టార్ రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో 'కాంతార' ఫ్రాంచైజీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ పార్ట్‌లో పంజుర్లి దేవుని చరిత్ర, రెండో పార్టులో శివుని ముఖ్య గణాలను అద్భుతంగా తెరకెక్కించారు. తాజాగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ 'కాంతార'లో సీన్స్‌పై చేసిన కామెంట్స్ విమర్శలకు దారితీశాయి.
కామెడీ కామెంట్స్!
గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI 2025) వేడుకల్లో మాట్లాడిన రణవీర్ 'కాంతార' గురించి ప్రస్తావిస్తూ కామెడీ చేశారు. రిషబ్ శెట్టి యాక్టింగ్ అద్భుతమని ప్రశంసిస్తూనే... 'కాంతార'లో పంజుర్లి దేవునికి సంబంధించిన సీన్‌ను ఇమిటేట్ చేశారు. 'హీరో పాత్రలోకి దెయ్యం ప్రవేశించినప్పుడు సీన్స్ చాలా బాగున్నాయి' అని అన్నారు. అలాగే స్టేజ్‌పై 'ఓ...' అనే శబ్దాన్ని ఇమిటేట్ చేశారు. ఈవెంట్‌లో హీరో రిషబ్ శెట్టి కూడా రణవీర్ అలా చేస్తుండగా నవ్వుతూనే కనిపించారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా... దేవుడి సీన్‌ను వెటకారంగా, కామెడీగా చేయడంతో కన్నడీగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరి దీనిపై బాలీవుడ్ హీరో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాల్సి ఉంది.
Also Read : డార్లింగ్ ప్రభాస్ షాకింగ్ డెసిషన్! - సందీప్ వంగా కండీషన్‌కు ఓకే చెప్పేశారా?... ఆ ప్రచారంలో నిజమెంత?
'కాంతార' 'కాంతార చాప్టర్ 1' రెండు మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వచ్చిన చాప్టర్ 1 అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫస్ట్ పార్ట్‌ను మించి రెస్పాన్స్ అందుకుంది. 'కాంతార'లో అద్భుతమైన నటనకు రిషబ్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక 'కాంతార చాప్టర్ 1' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 'హిందీ' వెర్షన్ కూడా తాజాగా అందుబాటులోకి వచ్చింది.