Dil Raju Big Update About Venu Yeldandi Yellamma Project : బలగం ఫేం వేణు యెల్దండి నెక్స్ట్ మూవీ 'ఎల్లమ్మ' అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్ లేదు. ఈ మూవీలో హీరో హీరోయిన్లపై అటు సోషల్ మీడియాలో ఇటు ఇండస్ట్రీలో ప్రచారం జరిగినా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజ్ మౌనం వీడారు. 

Continues below advertisement


బిగ్ అప్డేట్...


గోవాలో జరిగిన IFFI 2025 ఈవెంట్‌లో 'ఎల్లమ్మ' మూవీపై దిల్ రాజు నోరు విప్పారు. మరో 10 రోజుల్లో ఈ మూవీపై పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. తమ బ్యానర్ నుంచి ఈ ఏడాది 6 సినిమాలు రానున్నాయని... ప్రతీ స్క్రిప్ట్‌పైనా ఆచి తూచి డెసిషన్ తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఈ మూవీని రిలీజ్ చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు చెప్పగా... అది సాధ్యమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.


హీరోయిన్ ఎవరు?


ఈ మూవీలో హీరోగా తొలుత నితిన్ అని అంతా ఫిక్స్ అయ్యారు. అయితే, 'తమ్ముడు' డిజాస్టర్ తర్వాత సీన్ మారిపోయింది. ఆయనే ఈ ప్రాజెక్ట్ నుంచే తప్పుకున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌‌ల పేర్లు వినిపించినా ఎక్కడా కన్ఫర్మ్ కాలేదు. రీసెంట్‌గా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్స్ అయ్యారు. ఆయనకు ఈ మూవీతోనే హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక హీరోయిన్ విషయంలోనూ అదే కన్ఫ్యూజన్ నెలకొంది.


తొలుత సాయి పల్లవిని అనుకున్నా వివిధ కారణాలతో ఆమె ఈ ప్రాజెక్టుకు దూరమయ్యారు. ఆ తర్వాత కీర్తి సురేష్ 'ఎల్లమ్మ'గా ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చినా రీసెంట్ ఇంటర్వ్యూలో తాను ఇందులో నటించడం లేదంటూ కీర్తి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ మూవీలో హీరోయిన్ ఎవరా అనే చర్చ మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై త్వరలోనే ఫుల్ క్లారిటీ రానుంది. త్వరలో మూవీ గురించి ఇవ్వబోయే అప్డేట్‌లో ఫుల్ డీటెయిల్స్ తెలియనున్నాయి.


Also Read : 'అఖండ 2' సెన్సార్ రివ్యూ - బాలయ్య రుద్ర తాండవం సరే... మూవీలో హైలెట్స్ ఏంటో తెలుసా!


దేవిశ్రీ డ్యూయల్ రోల్


ఈ మూవీలో హీరోతో పాటు మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు కూడా దేవిశ్రీనే నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు తొలుత అజయ్ - అతుల్‌లను తీసుకుంటామని అనుకున్నప్పటికీ మ్యూజిక్ డైరెక్టర్‌గా దేవిశ్రీ అయితేనే బాగుంటుందని చాలా మంది అభిప్రాయం. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ, ఫీమేల్ లీడ్ పవర్ ఫుల్ రోల్ కావడంతో ఆయన మ్యూజిక్ అదిరిపోతుందని అంటున్నారు. మరో 10 రోజుల్లో మూవీ నుంచి అప్డేట్ రానుంది.