Kiran Abbavaram Offers His Favourite Bike Who Guess Dilruba Movie Plot: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) 'క' సినిమా సక్సెస్ తర్వాత వస్తోన్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్ 'దిల్ రూబా' (Dilruba). ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తుంగా.. ఈ చిత్రంతోనే విశ్వకరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మార్చి 14న మూవీ రిలీజ్ అవుతుండగా.. తాజాగా హీరో కిరణ్ అబ్బవరం బంపరాఫర్ ప్రకటించారు. ఈ సినిమా కథేంటో చెబితే సినిమాలో తాను వాడిన బైక్‌ను గిఫ్ట్‌గా ఇస్తానని ప్రకటించారు. ఆ బైక్ అంటే తనకు చాలా ఇష్టమని.. బైక్‌ను చూపిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక వీడియో షేర్ చేశారు. 'దిల్ రూబా మూవీ నా కోపం, లవ్‌ల సమ్మేళనం. ఈ బైక్ అంటే నాకు ఎంతో ఇష్టం. మా ఆర్ట్ డైరెక్టర్ ఎంతో శ్రమించి మూవీ కోసం దీన్ని తయారుచేశారు. ఇది మార్కెట్‌లో మీకు ఎక్కడా దొరకదు. అందుకే ఈ బైక్‌ను మీకు గిఫ్ట్‌గా ఇచ్చేయాలనుకుంటున్నా. ఈ బైక్‌ను సొంతం చేసుకునేందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. ఇప్పటివరకూ విడుదలైన పాటలు, వీడియోలు, ప్రమోషన్స్‌లో మేము చేసిన కామెంట్స్ ఆధారంగా ఈ మూవీ స్టోరీని మీరు చెప్పాలి. క్రియేటివ్‌గా చెప్పినవాళ్లకు ఈ బైక్ బహుమతిగా ఇస్తాను. అలాగే, బైక్ గెలుచుకున్న వ్యక్తితో ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తాను.' అని కిరణ్ బంపరాఫర్ ఇచ్చారు.






ఇప్పటికే రిలీజైన సాంగ్స్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా.. టీజర్లోనే బీజీఎం అలరించింది. ఈ మూవీని సెల్యులాయిడ్, సరిగమ బ్యానర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. కిరణ్ అబ్బవరం 'క' రిలీజ్ తర్వాత మూవీ కావడంతో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. నిజానికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా మూవీ విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. 


Also Read: హాట్ సమ్మర్.. కూల్ మూవీస్ - మార్చిలో రిలీజ్ అయ్యే చిత్రాలివే!, ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చెయ్యండి!