యవ్వనంగా కనిపించేందుకు ప్రయత్నించే ప్రజలు మనకు కనిపిస్తారు. అలాగని, అందరూ అలా ఉంటారని కాదు. కొంత మంది తమ వయసును దాచుకోకుండా రియల్‌గా ఉంటారు. యవ్వనంగా కనిపించేందుకు కొంత మంది సెలబ్రిటీలు చెప్పిన చిట్కాలను ఫాలో అవుతారు. వాళ్ళు ఏం చెబుతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తారు. అటువంటి వాళ్ళందరికీ అమెరికన్ స్టార్ కిమ్ కర్దాషియన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ షాక్ ఇచ్చింది.


కిమ్ కర్దాషియన్ అమెరికాలో పాపులర్. ఆమె టీవీ షోలు చేశారు, చేస్తున్నారు. ఇక, ఆమె ఫ్యాషన్ ఛాయస్‌లు వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు హాట్ టాపిక్ అవుతుంటాయి.


కిమ్ కర్దాషియన్ లేటెస్టుగా ఒక ఇంటర్వ్యూలో ''యవ్వనంగా కనిపించేందుకు నేను ఏం చేయడానికి అయినా సిద్ధమే. ప్రతి రోజూ 'మలం' తింటే యవ్వనంగా కనిపిస్తారని మీరు చెబితే... నేను తింటానేమో! ఐ మైట్'' అని చెప్పుకొచ్చారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.


Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?


కిమ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు వింతగా స్పందించారు. ఆ ట్వీట్లు మీరూ చూడండి. 




Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?