హిందీ అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలపై సామజిక మాధ్యమాల్లో ఒక వర్గం ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత పలువురు హిందీ చిత్రాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా' ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలని చాలా మంది ట్వీట్లు చేశారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు.
 
'సామ్రాట్ పృథ్వీరాజ్' శుక్రవారం విడుదలైంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు ఎలా ఉన్నాయి? దీనికి విమర్శకుల సమీక్షలు ఎలా ఉన్నాయి? వంటి విషయాలు పక్కన పెడితే... సోషల్ మీడియాలో ఒక వర్గం 'పృథ్వీరాజ్'ను బాయ్ కాట్ చేయాలని పిలుపు ఇస్తున్నారు. ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.


హిస్టరీ టెక్స్ట్ బుక్స్ గురించి అక్షయ్ కుమార్ స్టేట్మెంట్ విమర్శల పాలైంది. అదొక్కటే కాదు... అంతకు ముందు పాన్ మసాలా యాడ్ చేయడం, 'ఓ మై గాడ్' సినిమా విడుదల సమయంలో తాను గుళ్ళు గోపురాలు తిరగనని చెప్పి 'సామ్రాట్ పృథ్వీరాజ్' కోసం ఇప్పుడు దేవాలయాలను సందర్శించడం వంటి విషయాలు కొందరికి కోపం తెప్పించాయి. అందుకని, అక్షయ్ కుమార్ సినిమాను బాయ్ కాట్ చేయాలంటున్నారు.


Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?


బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ (KRK trolled Akshay Kumar's Samrat Prithviraj) తాను 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా ఫస్ట్ ఫస్ట్ షోకి వెళితే థియేటర్లో ఒక్కడినే ఉన్నానని ఖాళీగా ఉన్న హాలు ఫోటోను పోస్ట్ చేశారు. 



Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?