Salaar Movie Latest Update: 'సలార్' సినిమా షూటింగ్ విషయంలో కొన్ని రోజుల నుంచి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెయిట్ పెరగడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా వర్రీ అవుతున్నారని, వెయిట్ తగ్గితే తప్ప లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయనని ఖరాఖండీగా చెప్పారని, ప్ర‌భాస్‌కు వెయిట్ తగ్గమని కండిషన్లు పెట్టారని సదరు వార్త సారాంశం. అటువంటి వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టారు.


'సలార్' సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యారు. ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ రీసెంట్‌గా స్టార్ట్ అయ్యింది. సెట్స్‌లో దర్శకుడు ప్రశాంత్ నీల్‌ను ప్రభాస్ కౌగిలించుకున్న ఫొటోను సినిమా యూనిట్ ట్వీట్ చేసింది.






'సలార్' షూటింగ్ 30- 35 శాతం కంప్లీట్ అయ్యింది. ఈ ఇయర్ ఎండ్ లోపు షూటింగ్ కంప్లీట్ చేసి, నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అన్నట్టు... ఈ రోజు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. బర్త్ డేకి ఆయన సినిమా షూటింగ్ చేస్తున్నారు. సెట్స్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోనున్నారు.


Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?


ప్రభాస్ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. 'కె.జి.యఫ్ 2'ను నిర్మించినది ఆయనే. జగపతిబాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. 'సలార్' షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు 'కె.జి.యఫ్ 2' 50 డేస్ సెలబ్రేషన్స్‌లో ప్రభాస్ పాల్గొన్నారు.


Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?