'విజిల్' మహాలక్ష్మి కోసం సత్య ఐపీఎస్ కవిగా మారారు. మహాలక్ష్మి విజిల్ వేసి పోలిస్తే... 'చెవినది పడి కవినయ్యానే' అంటూ కొత్త పాట అందుకున్నారు. వీళ్లిద్దరి ప్రేమకథ ఏంటి? యాక్షన్ సినిమాలో ఎంత వరకూ ఉంటుంది? అనేది తెలియాలంటే జూలై 14 వరకూ వెయిట్ చేయాలి.
సత్య ఐపీఎస్ పాత్రలో ఉస్తాద్ రామ్ పోతినేని (Ram Pothineni), విజిల్ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి (Krithi Shetty) నటించిన సినిమా 'ది వారియర్' (The Warriorr). ఇందులో 'దడ దడ...' పాట (Dhada Dhada Song) ను ఈ రోజు ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ విడుదల చేశారు. తెలుగు, తమిళ భాషల్లో పాట విడుదలైంది. ''నేను ఈ పాట విన్నాను. నాకు చాలా నచ్చింది. మీకూ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అని ఆయన పేర్కొన్నారు.
'దడ దడమని హృదయం శబ్దం...
నువ్వు ఇటుగా వస్తావని అర్థం!
బడ బడమని వెన్నెల వర్షం...
నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం!
నువ్వు విసిరిన విజిల్ పిలుపు ఒక గజల్ కవితగా మారే...
చెవినది పడి కవినయ్యానే
తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే...
నీ ఊహల పిరమిడ్ నేనే'
అంటూ సాగిన ఈ గీతానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న చిత్రమిది. 'దడ దడ...' విడుదలైన సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ "మా సినిమాలో పాటను విడుదల చేసిన గౌతమ్ మీనన్ గారికి థాంక్స్. హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్స్‌లో పాటను చిత్రీకరించాం. అందరూ హమ్ చేసే విధంగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి మెలోడీ అందించారు. ఆల్రెడీ విడుదలైన 'బుల్లెట్...'కు 60 ప్లస్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. మిగతా పాటలకూ దేవిశ్రీ ప్రసాద్ హిట్ ట్యూన్స్ ఇచ్చారు. ఇటీవల సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూలై 14న (The Warrior Release On July 14th) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తాం'' అని తెలిపారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?