తన ఫ్యాషన్ స్టైల్ తో వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్. డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఫేమ్ తెచ్చుకోవాలని చూస్తున్న ఈ బ్యూటీ తన అందాలను ఆరబోసే విధంగా దుస్తులు ధరిస్తుంటుంది. ఆమె వేసుకునే బట్టలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అంత విడ్డూరంగా ఉంటాయి మరి. తనకు మాత్రమే నచ్చే ఈ స్టైల్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. ఈ క్రమంలో చాలా మంది ఆమెని ట్రోల్ చేస్తుంటారు.
అయినప్పటికీ ఉర్ఫీ మాత్రం తన డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో అందాల ప్రదర్శన ఆపడం లేదు. ఇదిలా ఉండగా.. కొన్నిరోజులుగా ఉర్ఫీను ఉద్దేశిస్తూ చాలా మంది నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఉర్ఫీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో షేర్ చేసింది. ఇటీవల పంజాబీ సింగర్ సిద్దు మూస్ వాలా మరణించిన సంగతి తెలిసిందే.
అతడికి బదులుగా ఉర్ఫీ చచ్చిపోతే బావుండేదని దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరు హద్దులు దాటి మరీ ఆమెని తిట్టిపోస్తున్నారు. వీటిపై రియాక్ట్ అయిన ఉర్ఫీ.. 'నేను చనిపోవాలని జనాలు కోరుకుంటున్నారు. నాకు ఎవరి చావుతో సంబంధం లేదు. కానీ జనాలు ఇలా మాట్లాడడం చాలా భయంగా ఉంది. ఇలాంటి క్రూరమైన ప్రపంచంలో మనం బతుకుతున్నాం. నేను చనిపోవాలని కోరుకుంటున్న వాళ్లకు చెప్పేది ఒక్కటే.. మీరు గట్టిగా ప్రేయర్ చేయండి.. ఎందుకంటే నేను ఇక్కడే ఉండబోతున్నా' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.