యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాకింగ్ స్టార్ యశ్ కథానాయకులుగా ఒక క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమా ప్లానింగ్‌లో ఉందా? 'కెజియఫ్ 3'లో ప్రభాస్, కన్నడ కథానాయకుడు మురళీ కూడా కనిపిస్తారా? హోంబలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగందూర్ చెప్పిన మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుదు ఇదే హాట్ టాపిక్.


దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ప్రణాళిక ప్రకారం సినిమాలు చేస్తూ వస్తున్నారని ఇటు సినిమా ఇండస్ట్రీలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ బలమైన ప్రచారం జరుగుతోంది. యశ్ హీరోగా ఆయన రూపొందించిన 'కెజియఫ్ 1', 'కెజియఫ్ 2' భారీ ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా 'కెజియఫ్ 2' విడుదలైన తర్వాత... ఆ సినిమాకు 'సలార్' కథకు లింక్ ఉందనే మాటలు వినిపించాయి. 


'కెజియఫ్ 2'లో ఈశ్వరీ రావు కుమారుడిగా కనిపించిన అబ్బాయి పేరు సలార్. అతడు పెద్దయ్యాక ప్రభాస్ అవుతాడనేది టాక్. సలార్ (ప్రభాస్) ఆర్మీ సాయంతో పార్లమెంట్ మీద రాఖీ భాయ్ ఎటాక్ చేశాడనేది కొంత మంది ఊహ. ఇప్పుడు విజయ్ కిరగందూర్ చెప్పిన మాటలకు వస్తే... లేటెస్ట్ ఇంటర్వ్యూలో ''మేం 'కెజియఫ్ 3'ను మార్వెల్ యూనివర్స్ తరహాలో డిజైన్ చేసుకున్నాం. వివిధ చిత్రాల్లో హీరోలు ఇందులో భాగస్వామ్యులు అవుతారు. 'డాక్టర్ స్ట్రేంజ్', 'స్పైడర్ మ్యాన్' క్యారెక్టర్లు ఒక సినిమాలో కలిసినట్టు... ఈ సినిమాలోనూ వివిధ సినిమాల్లో హీరోలు కలుస్తారు'' అని చెప్పారు.


Also Read: 'కెజియఫ్ 3' విడుదల ఎప్పుడో చెప్పిన ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్
 
విజయ్ కిరగందూర్ ఇంటర్వ్యూ తర్వాత... 'కెజియఫ్ 3' సినిమా యశ్, ప్రభాస్ చేయబోయే మల్టీస్టారర్ అవుతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. అసలు విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అన్నట్టు... 'సలార్' షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత 'కెజియఫ్ 3' స్టార్ట్ చేసి, 2024లో విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. 


Also Read: 'ఆస్తులన్నీ పోగొట్టాడు, ఒక్క పూటే భోజనం చేసేదాన్ని' - షావుకారు జానకి ఎమోషనల్ కామెంట్స్