Kasthuri Shankar About Bharateeyudu 2: కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమా ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచిపోయింది. అప్పట్లోనే ఈ మూవీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కింది. ‘ఇండియన్ 2’ను ఎన్నో ఇబ్బందులు దాటించి రిలీజ్ వరకు తీసుకొచ్చారు మేకర్స్. ‘భారతీయుడు’లో కమల్ చెల్లెలి పాత్రలో నటించి మెప్పించారు కస్తూరి శంకర్. తాజాగా ఆ మూవీ షూటింగ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో పాటు ‘భారతీయుడు 2’పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పెద్ద తపస్సు..
‘‘భారతీయుడులో ముందుగా నన్ను ఊర్మిళ క్యారెక్టర్‌కు ఆడిషన్ చేశారు. అప్పుడే ‘రంగీలా’ మూవీ ట్రైలర్ వచ్చింది. అది చూసి ఆ రోల్‌ను ఊర్మిళకు ఇచ్చేశారు. తర్వాత చెల్లెలి పాత్ర గురించి చెప్పారు. కథ విన్న తర్వాత ఇదే కీలక పాత్ర అని తెలిసింది. పేరుకే హీరోయిన్ ఉంటుంది. కానీ చెల్లెలి పాత్ర చుట్టూనే కథ తిరుగుతుంటుంది అని అర్థమయ్యింది. అలాంటి కాంబినేషన్‌లో నటించే అదృష్టం కూడా మళ్లీ మళ్లీ రాదు. ఇండస్ట్రీలో పీక్ స్టేజ్‌లో ఉన్న అందరినీ ఒక్క దగ్గర చేర్చి భారతీయుడు మూవీ చేశారు. పైగా నాది మంచి పాత్ర. దానివల్లే నాకు తెలుగులో అవకాశాలు మొదలయ్యాయి. భారతీయుడులో పచ్చని చిలుకలు పాట చూడడానికి ఎంత బాగుంటుందో కానీ అది తీయడం మాత్రం పెద్ద తపస్సులాగా జరిగింది’’ అంటూ ‘భారతీయుడు’ రోజులను గుర్తుచేసుకున్నారు కస్తూరి శంకర్.
పార్టీలు మాత్రమే కాదు..
‘భారతీయుడు’లో ముసలివాళ్లలాగా కనిపించడం కోసం కమల్ హాసన్, సుకన్య.. దాదాగా 3,4 గంటలు మేకప్ వేసుకునేవారని, అది కూడా రెండు గంటలు మాత్రమే ఉండేదని బయటపెట్టారు కస్తూరి శంకర్. ‘‘కమల్ హాసన్‌కు అప్పుడే పద్మశ్రీ వచ్చింది. ఆయనను ఆయన టార్చర్ చేసుకొని కష్టపడి నటించేవారు. అది చూసే నేను డెడికేషన్, హార్డ్ వర్క్ నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో క్రమశిక్షణగా ఉండాలి. సినిమా అంటే రేవ్ పార్టీలకు వెళ్లడం, గాసిప్స్‌లో వచ్చినట్టుగా కాంప్రమైజ్‌లు చేసుకోవడం కాదు. క్రమశిక్షణ లేకపోతే సినిమా చేయలేం. సినిమా అంటే పెళ్లి చేసినట్టు.. అదంతా ఈజీ కాదు. పార్టీలు చేసుకుంటూ తాగుతూ కూర్చుంటే అవ్వదు. సినిమావాళ్లంటే పార్టీలు చేసుకోవడమే అని అందరూ చెప్తున్నారు. ఇప్పుడు అదే ఫ్యాషన్ అయిపోయింది’’ అని ఫైర్ అయ్యారు కస్తూరి శంకర్.
ఏడేళ్ల నుంచి..
‘భారతీయుడు 2’లో తను నటించిందా అని అడగగా.. తనను మొదటి పార్ట్‌లోనే చంపేశారని గుర్తుచేశారు కస్తూరి శంకర్. ‘‘తప్పుగా అనుకున్న పర్వాలేదు కానీ నిజం చెప్తాను. భారతీయుడు 2 ఎప్పుడు రాబోతుంది అని ఎదురుచూసిన టైమ్ పోయింది. 2018లోనే ఈ సినిమా వస్తుంది అన్నారు. ఇంకా రాలేదు. ఇప్పుడు పక్కా వస్తుంది అంటున్నారు. దాదాపుగా ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు వచ్చినా ఏముందిలే అనిపిస్తోంది. సాంగ్స్ రిలీజ్ చేశారు. ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం కాబట్టి సాంగ్స్‌లో ఆ జోష్ లేదు అనిపించింది. నేను చాలా అంచనాలతో భారతీయుడు 2 కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ ఇన్ని అంచనాలు వద్దు అని భయమేస్తోంది. శంకర్, కమల్ కాంబినేషన్‌లో మళ్లీ మళ్లీ సినిమాలు వస్తే బాగుంటుంది. కానీ ఒక్క సినిమాకే ఏడేళ్లు అంటే ఎలా?’’ అంటూ ‘భారతీయుడు 2’పై వ్యాఖ్యలు చేశారు కస్తూరి.
Also Read: మోక్షజ్ఞతో ప్రశాంత్ వర్మ మూవీ - అంతేకాదు, మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఉందట!