నాచురల్ స్టార్ నాని (Nani) మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ రెడీ. 'రైడ్' ఇద్దరు హీరోల సినిమా. 'ఎవడే సుబ్రమణ్యం'లో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ కీలకంగా ఉంటుంది. కెరీర్ స్టార్టింగ్ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. కింగ్ అక్కినేని నాగార్జునతో 'దేవ్ దాస్' చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.
'హిట్ 3'లో మరో హీరో... ఖైదీ వస్తాడా?
నాని కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'హిట్ 3' (Hit 3 The Third Case). విశ్వక్ సేన్ 'హిట్', అడవి శేష్ 'హిట్ 2' సినిమాల తరువాత హిట్ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రమిది. ఇందులో మరొక హీరో కూడా ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
'హిట్ 3'లో అడవి శేష్ కాసేపు కనిపిస్తారని, ఆయన పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. 'హిట్ 3'లో అడవి శేష్ నటిస్తున్న సంగతి కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమాలో తమిళ హీరో కార్తీ కూడా నటించవచ్చట.
కార్తీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించిన 'ఖైదీ' బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ ఖైదీ క్యారెక్టర్ హిట్ 3లో కనిపిస్తుందని టాలీవుడ్ గుసగుస. ఖైదీగా కాదని, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కార్తీ ఎంట్రీ ఇస్తారని మరొక టాక్. తమిళంలో కార్తీ కొన్ని సినిమాల్లో పోలీస్ రోల్స్ చేశారు. అన్నీ కుదిరితే 'హిట్ 3' చివర్లో ఆయన క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చి, 'హిట్ 4'లో ఆయన్ను మెయిన్ హీరో చేస్తారని టాక్. ఇందులో నిజం ఎంతనేది మరికొన్ని రోజుల్లో తెలుస్తుంది.
Also Read: మధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్ కుమార్ సినిమా బావుందా? లేదా?
'హిట్ 3' చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫ్రాంచైజీలో మొదటి రెండు సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు. అయితే విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన 'సైంధవ్' సినిమా డిజాస్టర్ రిజల్ట్ అందుకుంది. అందుకని హిట్ 3 సినిమాతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాలని దర్శకుడు ట్రై చేస్తున్నారు.
'హిట్ 3'లో నాని సరసన 'కేజిఎఫ్' హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళిద్దరి మీద తెరకెక్కించిన ఒక పాటను ఇటీవల విడుదల చేయగా మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో మే 1న ఈ సినిమా విడుదల కానుంది.
Also Read: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?