Shalini Pandey: 'దిల్' రాజు సినిమాకూ టైమ్ ఇవ్వలేదు... హిందీ కోసం సౌత్ వదిలేసింది... ఇప్పుడు కామెంట్స్ ఏంటమ్మా?

Shalini Pandey Latest News: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ శాలినీ పాండే తన కాన్సంట్రేషన్ అంతా హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌ల మీద పెట్టింది. సడన్‌గా సౌత్ డైరెక్టర్ మీద కామెంట్స్ చేయడంతో వార్తల్లోకి వచ్చింది.

Continues below advertisement

'అర్జున్ రెడ్డి'తో విజయ్ దేవరకొండ స్టార్ హీరో అయ్యాడు. సినిమా ఆ స్థాయిలో సూపర్ హిట్ అయితే, ట్రెండ్ సెట్టర్ కింద నిలిస్తే... ఆ సినిమాలో హీరోయిన్ వెంట ఆఫర్లు క్యూ కడతాయి. 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలిని పాండే మాత్రం విజయ్ దేవరకొండ స్థాయిలో సక్సెస్ కాలేదు అందుకు కారణం ఆవిడ వేసిన తప్పటడుగులే. తన తప్పులు చెప్పకుండా సౌత్ సినిమా డైరెక్టర్ తలుపు తట్టకుండా వ్యానిటీ వ్యాన్‌లోకి ఎంటర్ అయ్యాడని కామెంట్స్ చేయడంతో టాలీవుడ్ జనాలు ఆవిడ మీద మండి పడుతున్నారు.

Continues below advertisement

'దిల్' రాజు సినిమాకూ టైం ఇవ్వలేదు!
'అర్జున్ రెడ్డి' తర్వాత తెలుగులో షాలిని పాండే (Shalini Pandey)కి వరుస అవకాశాలు వచ్చాయి. అసలు ఆవిడకు కథానాయికగా అవకాశం ఇచ్చినది తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆవిడ హీరోయిన్ రోల్ చేసిన ఫస్ట్ సినిమా 'అర్జున్ రెడ్డి'. ఆ తర్వాత తెలుగులో పేరున్న దర్శకులు నాగ్ అశ్విన్, క్రిష్ జాగర్లమూడితో పాటు అగ్ర నిర్మాత 'దిల్' రాజు సినిమాలలో షాలినికి అవకాశాలు వచ్చాయి. అయితే ఆవిడ మాత్రం తెలుగును వదిలేసి హిందీ మీద కాన్సంట్రేషన్ చేసింది.

దిల్ రాజు నిర్మాణ సంస్థలో యువ హీరో రాజ్ తరుణ్ సరసన 'ఇద్దరి లోకం ఒకటే'లో షాలిని పాండే నటించింది. ఆ సినిమా చేస్తున్న సమయంలో హిందీలో రణవీర్ సింగ్ 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా చేసే అవకాశం వచ్చింది. దాంతో తెలుగును పూర్తిగా లైట్ తీసుకుంది. సినిమా ప్రమోషన్స్ చేయడానికి కూడా టైం ఇవ్వలేదు. అసలు 'ఇద్దరి లోకం ఒక్కటే' వైపు చూడలేదు. ఒక ప్రెస్ మీట్ లో 'మా హీరోయిన్ ఇప్పుడు హిందీ సినిమా చేస్తుంది. అందుకే మా ప్రమోషన్స్ కి కూడా రావడం లేదు. టైం ఇవ్వడం లేదు' అని దిల్ రాజు స్వయంగా చెప్పారంటే... శాలిని పాండే వాళ్ళని ఏ స్థాయిలో పట్టించుకోవడం మానేసిందో అర్థం చేసుకోవచ్చు. 

'ఇద్దరి లోకం ఒకటే' సినిమా ప్రమోషన్స్ వరకు మాత్రమే కాదు సినిమా కంప్లీట్ చేయడానికి కూడా 'దిల్' రాజు అండ్ టీంను షాలిని పాండే ఇబ్బంది పెట్టిందని అప్పట్లో ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. హిందీ సినిమాలో ఛాన్స్ రావడంతో సౌత్ తనకు అవసరం లేదన్నట్టు ఆవిడ వ్యవహరించిందని సినిమా యూనిట్స్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినిమా పూర్తి చేయడానికి ఏ మాత్రం సహకరించలేదని గుసగుస.

Also Read: 'అర్జున్ రెడ్డి' హీరోయిన్‌ది పబ్లిసిటీ స్టంటా? సడన్‌గా సౌత్ డైరెక్టర్‌పై కామెంట్స్‌ ఎందుకు?

కోటి ఆశలతో షాలిని పాండే 'జయేష్ భాయ్ జోర్దార్' సినిమా చేస్తే అది కాస్త బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది. దాంతో ఆమె వైపు బాలీవుడ్ జనాలు చూడడం మానేశారు. తెలుగులో అవకాశాల కోసం ట్రై చేద్దామంటే 'దిల్' రాజు అంటే అగ్ర నిర్మాతకు చుక్కలు చూపించిన అమ్మాయితో మనం సినిమా చేయలేమన్నట్లు మిగతా దర్శక నిర్మాతలు ఆవిడను పక్కన పెట్టేశారు. దాంతో చాలా రోజులు షాలిని పాండే ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. గత ఏడాది ఆ అమ్మాయి నటించిన 'మహారాజ్' సినిమా ఓటీటీలో విడుదల అయింది. ఇప్పుడు 'డబ్బా కార్టెల్' వెబ్ సిరీస్ వచ్చింది. తెలుగులో తనకు అవకాశాలు రావని స్పష్టత రావడంతో సౌత్ దర్శకుడి మీద కామెంట్స్ చేసిందని షాలిని పాండే మీద టాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు.

Also Readమధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?

Continues below advertisement