బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' సినిమా ఇటీవల విడుదలై ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. జూలై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకి ఎలాగైనా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మూవీ టీం వరస ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ టీం తాజాగా ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈ సక్సెస్ మీట్ లో సినిమాలో నటించిన నటీనటులు , దర్శకుడు తమ అనుభవాలను పంచుకున్నారు.


ఈ క్రమంలోనే దర్శకుడు కరణ్ జోహార్ సినిమాలో కొన్ని సన్నివేశాలను తన వ్యక్తిగత జీవితంలో జరిగిన సంఘటనల నుంచి తీసినట్లు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడుతూ.." నేను మా అమ్మకు లో దుస్తులు కొనిస్తాను. ఇదేమీ అంత సిగ్గుపడాల్సిన విషయం కాదు. కానీ నా స్నేహితులు మాత్రం మా అమ్మ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు ఎంతో భయపడిపోతారు. ఎవరికైనా అమ్మాయికి చెప్పి ఆమెతో కొనిపించవచ్చు కదా అని నాకు సూచనలు ఇస్తారు. మా అమ్మ నన్ను తీసుకుని రమ్మని చెప్పినప్పుడు నేను ఇంకొకరికి చెప్పడం ఎందుకు? మా అమ్మకు ఇప్పుడు 81 ఏళ్ళు. ఆమెకు ఏది కావాలన్నా స్వయంగా నేనే వెళ్లి తీసుకొస్తా. అవి లో దుస్తులు కావచ్చు. మరేదైనా కావచ్చు. కానీ అందరూ దాన్ని ఎంతో అసౌకర్యంగా ఫీల్ అవుతారు" అని చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.


అంతేకాదు తన జీవితంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనలనే ఈ సినిమాలో అవసరానికి అనుగుణంగా చిత్రీకరించానని చెప్పడంతో కరణ్ జోహార్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ కహాని' సినిమా విషయానికొస్తే.. బాలీవుడ్ స్టార్స్ రణవీర్ సింగ్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాలో ధర్మేంద్ర, జయ బచ్చన్, షబానా అజ్మీ కీలకపాత్రలు పోషించారు. ప్రీతం చక్రవర్తి సంగీతం అందించిన ఈ సినిమాని వయాకామ్ 18 స్టూడియోస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహార్, హిరూ యాష్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా నిర్మించగా.. మనూష్ నందన్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.


2016లో వచ్చిన 'ఏ దిల్ హై ముష్కిల్' సినిమా తర్వాత కరణ్ జోహార్ దర్శకుడిగా గ్యాప్ తీసుకున్నారు. సుమారు ఏడేళ్ల  సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ 'రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని' సినిమాకి దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాతో దర్శకుడిగా మరో సక్సెస్ అందుకున్నారు కరణ్. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ముఖ్యంగా సినిమాలో రణవీర్, ఆలియాల కెమిస్ట్రీ, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.


Also Read : ఆ దర్శకుడి స్ఫూర్తితో, రూ.80 కోట్లు విలువ చేసే కార్లు వాడాం: మంచు లక్ష్మి





Join Us on Telegram: https://t.me/abpdesamofficial