Just In





Kantara Chapter 1 Release Date: గాంధీ జయంతికి 'కాంతార' ప్రీక్వెల్... లాంగ్ వీకెండ్ మీద కన్నేసిన రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’తోె నేరుగా తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ‘కాంతారా చాప్టర్ 1’ ప్రీక్వెల్ ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty)ని పాన్ ఇండియా స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘కాంతారా’ (Kantara). చిన్న సినిమాగా విడుదలై పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ (Hombale Films)పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఆ సినిమా ‘కాంతారా చాప్టర్ 1’ (Kantara Chapter 1). రిషబ్ శెట్టి హీరోగా నటిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం కర్ణాటకలో శరవేగంగా సాగుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
గాంధీ జయంతికి కాంతారా ప్రీక్వెల్ రిలీజ్!
Kantara Chapter 1 Release Date: వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2వ తేదీన ‘కాంతారా చాప్టర్ 1’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
క్రేజీ ఫిల్మ్ కోసం భారీ సెట్
‘కాంతారా చాప్టర్ 1’ సినిమా ప్రీ టీజర్ తోనే ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేసింది. పీరియాడికల్ మూవీగా రూపొందుతోన్న ఈ ప్రీక్వెల్ కు సంబంధించిన విశేషాలు సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాయి. ‘కాంతారా’ ద్వారా కొంకణ్ జానపద జీవితాల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సినిమా ప్రీక్వెల్ కోసం గత కాలపు గుర్తుల్ని వెండి తెరపై ఆవిష్కరించనున్నారు. దక్షిణ భారత చరిత్రలో స్వర్ణ యుగంగా పేరొందిన కదంబ రాజ్య నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. మూడో శతాబ్దపు కాదంబ రాజ్య వైభవం, ఆనాటి ఆనవాళ్లు ప్రతిబింబించేలా కర్ణాటకలోని కుండా పుర అనే ప్రాంతంలో ఈ సినిమా సెట్ ను రూపొందించారు. ప్రాచీన యుద్ధ కళ కలరియుపట్టులో రిషబ్ శెట్టి శిక్షణ పొందుతున్నారు.
Also Read: Pushpa 2 Trailer Launch Highlights - పాట్నా ప్రజల ప్రేమకు ఐకాన్ స్టార్ ఫిదా... బన్నీ స్పీచ్ to 2 లక్షల మంది జనాలు, పోలీస్ సెక్యూరిటీ - 'పుష్ప 2' ట్రైలర్ లాంఛ్ హైలైట్స్
Kantara chapter 1 cast and crew: ఈ చిత్రానికి అజనీష్ లోెక్ నాథ్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక రిషబ్ శెట్టి విషయానికి వస్తే... ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ అనే చిత్రానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా విడుదల చేసిన ‘జై హనుమాన్’ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. కాంతారా ప్రీక్వెల్‌తో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు రిషబ్ శెట్టి.
Also Read: నాగ చైతన్య ఒకలా, శోభిత మరోలా... శుభ లేఖలు పంచుతున్న అక్కినేని, ధూళిపాళ ఫ్యామిలీలు, ఆ రెండూ చూశారా?