Kannappa: యూట్యూబ్‌లో కన్నప్ప 'శివ శివ శంకరా' సాంగ్ రికార్డు - 8 కోట్ల వ్యూస్‌తో ట్రెండింగ్‌లోకి.. ఎటు చూసినా శివనామ స్మరణే..

Shiva Shiva Shankara: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' రీసెంట్‌గా 'శివ శివ శంకరా..' అంటూ సాంగ్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట యూట్యూబ్‌లో 8 కోట్ల వ్యూస్ సొంతం చేసుకోవడం సహా ట్రెండింగ్‌లో ఉంది.

Continues below advertisement

Kannappa Shiva Shiva Shankara Song Record On Youtube: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ 'కన్నప్ప' (Kannappa). మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర మహత్యంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ఈ మూవీని రూపొందిస్తున్నారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న సినిమాలో టైటిల్ రోల్‌లో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ బాబు, కాజల్, అగర్వాల్, మోహన్ లాల్, ప్రీతి ముకుందన్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల లాంటి దిగ్గజ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, హీరోల ఫస్ట్ లుక్స్, తొలి గ్లింప్స్ మూవీపై భారీగా అంచనాలు పెంచేశాయి. ఇటీవల విడుదలైన 'శివ శివ శంకరా' పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. 

Continues below advertisement

8 కోట్ల వ్యూస్.. చార్ట్ బస్టర్

'శివ శివ శంకరా.. సాంబ శివ శంకరా.. హర హర శంకరా.. నీలగంధరా..' అంటూ సాగే లిరిక్స్ ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్‌గా విడుదలైన ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ పాటను 8 కోట్ల మంది వీక్షించారు. అటు, సోషల్ మీడియాలోనూ ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇన్ స్టాగ్రాంలో 2 లక్షలకు పైగా రీల్స్ చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అన్ని వర్గాల ఆడియన్స్‌ను సాంగ్ మైమరపించింది. మహాశివరాత్రి సందర్భంగా ఈ పాట మరింత ట్రెండ్ అవుతోంది. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా విజయ్ ప్రకాష్ ఆలపించారు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవస్సే మ్యూజిక్, బీజీఎం అందిస్తున్నారు. ఈ మూవీని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల పై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు.

Also Read: ఆశ్రమంలో అత్యాచారం, హత్యల వెనుక మిస్టరీ - బాబా బండారం బయటపడిందా?.. ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, ఎప్పటి నుంచంటే?

'ఇంతటి రెస్పాన్స్ ఊహించలేదు'

మహా శివరాత్రి సందర్భంగా ’శివా శివా శంకరా’ పాట మరింతగా ట్రెండ్ అవుతుండడంపై నటుడు మంచు విష్ణు స్పందించారు. ప్రజలు దీన్ని స్వీకరించిన విధానం, రీల్స్ చేస్తూ తమ భక్తిని ప్రదర్శిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతలా ఈ పాట ట్రెండ్  అవుతుందని తాము ఊహించలేదన్నారు.

ఈ సమ్మర్‌కు రిలీజ్ 

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న 'కన్నప్ప' మూవీలో కన్నప్పగా మంచు విష్ణు, రుద్రుడిగా ప్రభాస్, పార్వతీదేవిగా కాజల్ కనిపించనున్నారు. మోహన్‌బాబు నిర్మాతగా వ్యవహరించడం సహా మహాదేవశాస్త్రి పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాతోనే విష్ణు తనయుడు ఆవ్రామ్ తెరంగేట్రం చేయనుండగా.. అతను బాల తిన్నడు అనే పాత్రలో కన్పించబోతున్నాడు. ఈ ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న మూవీని థియేటర్లలోకి రిలీజ్ చేయనున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమాను చాలా వరకు న్యూజిల్యాండ్ అడవుల్లో చిత్రీకరించారు. మరికొంత భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్‌లో తెరకెక్కించారు. ఏడేళ్ల నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నట్లు మంచు విష్ణు తెలిపారు. రూ.140 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా మంచు ఫ్యామిలీతో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మైలురాయి అవుతుందని బలంగా నమ్ముతున్నారు.

Also Read: ట్రయాంగిల్ లవ్ స్టోరీకి మదర్ సెంటిమెంట్ - తెలుగులోకి వచ్చేస్తోన్న కన్నడ బ్లాక్ బస్టర్, 'ఈటీవీ విన్'లో చూసెయ్యండి!

Continues below advertisement