Avram Manchu Kannappa Movie First Look: మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ మూవీపై ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేలా మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సోమవారం ఈ చిత్రానికి సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇస్తున్నారు. మూవీపై అంచనాలను రోజు రోజుకు పెంచేలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించి పోస్టర్లను విడుదల చేస్తున్నారు. క్యారెక్టర్ల విషయంలో ప్రేక్షకులలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


కృష్ణాష్టమి రోజున స్పెషల్ పోస్టర్ రిలీజ్


ప్రతి సోమవారం మాదిరిగానే ఈ సోమవారం కూడా ఓ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. కృష్ణాష్టమి రోజున రిలీజ్ చేయబోయే  పోస్టర్ కు చాలా చాలా ప్రత్యేకత ఉంది. స్పెషల్ అనగానే ఈ చిత్రంలో నటించే ప్రభాస్ గురించే అయి ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ, మంచు విష్ణు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నాడు అవ్రామ్. ‘కన్నప్ప’ చిత్రంలో ఈ చిన్నోడు ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంతోనే వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అతడి పోస్టర్ నే సోమవారం నాడు రిలీజ్ చేయబోతున్నారు.






‘కన్నప్ప’ చిత్రంలో మంచు ఫ్యామిలీ మూడు తరాలు


‘కన్నప్ప’ సినిమా మంచు ఫ్యామిలీకి వెరీ వెరీ స్పెషల్ కానుంది. మంచు కుటుంబానికి సంబంధించిన మూడు తరాల వ్యక్తులు ఈ చిత్రంలో కనిపించనున్నారు. మంచు మోహన్ బాబు, విష్ణు, అవ్రామ్ కలిసి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అవ్రామ్ పోషించే పాత్ర ఏంటి? అతడి లుక్ ఎలా ఉండబోతుంది? అని ప్రేక్షకులలో క్యూరియాసిటీ నెలకొంది. అయన లుక్ గురించి తెలుసుకోవాలంటే మరో మూడు రోజులు వెయిట్ చేయక తప్పదు. ఈ పోస్టర్ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తుందని మేకర్స్ వెల్లడిస్తున్నారు.      


డిసెంబర్ లో అట్టహాసంగా విడుదల  


మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా రూపొందుతోంది. సుమారు రూ. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ చివరి దశకకు చేరుకుంది. మరోవైపు పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. అదే సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియన్ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.    


Read Also: రేవ్ పార్టీ కేసు - ఆ షరతుతో నటి హేమపై ‘మా’ కీలక నిర్ణయం, ఇంతకీ ఏం జరిగిందంటే?



Read Also: బుచ్చిబాబు చిత్రంలో చిట్టిబాబు.. ఖతర్నాక్ కామెడీతో నవ్విస్తానంటున్న రామ్ చరణ్