Ram Charan: బుచ్చిబాబు చిత్రంలో చిట్టిబాబు.. ఖతర్నాక్ కామెడీతో నవ్విస్తానంటున్న రామ్ చరణ్

రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా రాబోతోంది. RC16 పేరుతో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీ జానర్ ఏంటో హింట్ ఇచ్చారు రామ్ చరణ్.

Continues below advertisement

Ram Charan About RC 16: గ్లోబర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. RC16 పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. స్పోర్ట్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీ మేకకర్స్ సమర్పణలో ఈ మూవీ రూపొందనుంది. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.  

Continues below advertisement

కామెడీ జానర్‌లో RC 16

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ RC16కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా జానర్ ఏంటో వెల్లడించారు. “నేను కామెడీ మూవీ ఎప్పుడూ చేయలేదు. బుచ్చిబాబుతో చేయబోయే ఈ సినిమా ఈ జానర్ లోనే ఉంటుంది. రొమాంటిక్ సినిమాలతో పోల్చితే యాక్షన్ సినిమాలే ఎక్కువగా నచ్చుతాయి. నేను నటించిన సినిమాల్లో ‘ఆరెంజ్’, ‘రంగస్థలం’ అంటే చాలా ఇష్టం. ‘మగధీర’ నా ల్యాండ్ మార్క్ చిత్రం. ఆటల కంటే బుక్స్ ఇష్టం. ‘Who Moved My Cheese’ పుస్తకం నాకు చాలా ఇష్టం. వెస్ట్రన్ దుస్తులతో పోల్చితే సంప్రదాయ దుస్తులే నచ్చుతాయి. కోలీవుడ్ హీరో సూర్య నాకు ఇష్టమైన నటుడు. ఇష్టమైన హీరోయిన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. అందరూ బాగుంటారు. ఈతరం హీరోయిన్లలో సమంత అంటే ఇష్టం” అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.  

RC16 టైటిల్ ఫిక్స్ అయ్యిందా?

పొలిటికల్ యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న RC16కి ‘పెద్ది’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. గతంలో ఈ టైటిల్ ను ఎన్టీఆర్ సినిమా కోసం బుచ్చిబాబు రిజిస్టర్ చేయించారట. ఇప్పుడు అదే పేరును రామ్ చరణ్ సినిమాకు పెడుతున్నట్లు టాక్ వినిపించింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.  

డిసెంబర్ లో ‘గేమ్ ఛేంజర్’ విడుదల

ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు. తమిళ దర్శకుడు శంకర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఫీమేల్ లీడ్ పోషిస్తోంది. ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్ జే సూర్య, సముద్రఖని, నవీన్ చంద్రతో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాని మేకర్స్ భావిస్తున్నారు. 

Read Also: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!

Continues below advertisement
Sponsored Links by Taboola