Ban Lifted On Actress Hema: తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో సంచలనం సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమపై మా అసోసియేషన్ గతంలో విధించిన బ్యాన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల హేమతో పాటు ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


సభ్యుల అభిప్రాయాల సేకరణ తర్వాత హేమపై వేటు


జూన్ మొదటి వారంలో బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో నటి హేమ పాల్గొన్నది. ఈ నేపథ్యంలో జూన్ 6న మా నుంచి హేమను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు హేమను మా అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయాలా? వద్దా? చెప్పాలంటూ సభ్యుల అభిప్రాయాలను సేకరించారు. మెజార్టీ సభ్యులు ఆమెపై నిషేధం విధించాలన్నారు. సభ్యుల నిర్ణయం మేరకు ఆమెపై బ్యాన్ విధించారు. ఈ కేసులో హేమకు క్లీన్ చిట్ వచ్చే వరకు సస్పెన్షన్ కొనసాగుతుంటూ ప్రకటించారు. అయితే, ఇంకా కేసు విచారణ కొనసాగుతుండగానే ఆమెపై బ్యాన్ ఎత్తివేయడం పట్ల అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఆమెను మీడియా మందు మాట్లాడవద్దని షరతు విధించినట్లు తెలిసింది.  


హేమకు అండగా నిలిచిన మంచు విష్ణు


వాస్తవానికి బెంగళూరు రేవ్ పార్టీ తర్వాత హేమపై రకరకాల వార్తలు వచ్చాయి. అయినప్పటికీ మా అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు అండగా నిలబడ్డారు. హేమ కేవలం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటుందన్నారు. ఆమెపై నేరం రుజువు అయినప్పుడు చర్యలు ఉంటామని వెల్లడించారు. ఆ తర్వాత పోలీసులు కేసు విచారణ మొదలు పెట్టారు. అనంతరం సభ్యుల అభిప్రాయాల మేరకు ఆమెను అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.






రేవ్ పార్టీలో పాల్గొనలేదని నమ్మించే ప్రయత్నం చేసిన హేమ


నిజానికి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నా, తొలుత తాను పాల్గొనలేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. తాను హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బిర్యానీ తింటూ చిల్ అవుతున్నట్లు కథలు చెప్పింది. కానీ, ఆ తర్వాత ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న సెలబ్రిటీలందరికీ బెంగళూరు క్రైం పోలీసులు నోటీసులు పంపించారు. నోటీసులు తీసుకున్న వారిలో హేమ కూడా ఉన్నది. ఆ తర్వాత విచారణ విషయంలోనూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. జ్వరం వచ్చిందని, తాను విచారణకు రాలేనని చెప్పింది. కానీ, పోలీసులు అంగీకరించకపోవడంతో ఆమె ఆ తర్వాత విచారణకు హాజరైంది. విచారణ సమయంలోనే ఆ పార్టీకి వెళ్లిన వారి బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు తీసుకున్నారు. ఈ పరీక్షల్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. ప్రస్తుతం కేసు విచారణ కోనసాగుతోంది. తాజాగా ఆపై మా అసోసియేషన్ బ్యాన్ ను ఎత్తివేసింది. 


Read Also: బుచ్చిబాబు చిత్రంలో చిట్టిబాబు.. ఖతర్నాక్ కామెడీతో నవ్విస్తానంటున్న రామ్ చరణ్



Read Also: ఓటీటీలోకి వచ్చిన ధనుష్ యాక్షన్ డ్రామా 'రాయన్' - ఆర్ అంటే రివేంజ్, ఓ రేంజ్‌లో ఉంటుంది మరి!