జాతీయ పురస్కార గ్రహీత, తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితులైన తమిళ అగ్ర కథానాయకులలో ఒకరైన సూర్య శివ కుమార్ (Suriya Sivakumar) నటిస్తున్న తాజా సినిమా 'కంగువా' (Kanguva Movie). ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలతో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఒక్క మాటతో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశారు సూర్య. 


మేం ఊహించిన దానికంటే వందరెట్లు అద్భుతంగా...
హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా 'కంగువా' రూపొందుతోంది. సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన స్పందన లభించింది. అయితే... సూర్య చెప్పిన తాజా మాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. 


తమిళనాడులోక్ ఇటీవల అభిమానులతో సూర్య సమావేశం అయ్యారు. అప్పుడు ''మేం ఊహించిన దాని కంటే 100 రేట్లు అద్భుతంగా 'కంగువా' సినిమా వచ్చింది. ప్రస్తుతం నేను ఆ సినిమా పనుల్లో బిజీ బిజీగా ఉన్నాను'' అని సూర్య చెప్పారు. అదీ సంగతి! 
'కంగువా' టీజర్ చూస్తే... ప్రాచీన తెగకు చెందిన నాయకుడిగా సూర్య కనిపించారు. ఆయన పాత్ర వీరోచితంగా ఉంటుందని అర్థం అవుతోంది. మరీ ముఖ్యంగా టైటిల్ రివీల్ చేసినప్పుడు సూర్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అని చెప్పాలి.  


Also Read : చిరంజీవికి డబ్బే ముఖ్యమైతే 'ఆచార్య'కు తిరిగి ఇస్తారా? 'ఏజెంట్'కు అనిల్ సుంకర ఇచ్చారా?



పది భాషల్లో... త్రీడీలో 'కంగువా'
Kanguva Release In 10 Laguanges : 'కంగువా'ను పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ పది భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. 'కంగువా'లో సూర్య సరసన హిందీ హీరోయిన్, తెలుగు సినిమా 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ (Disha Patani) నటిస్తున్నారు. 'కంగువా' టీజర్‌ను సైతం ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. త్వరలో మరో నాలుగు భాషల్లో విడుదల చేయనున్నారు. 


దేవి శ్రీ నేపథ్య సంగీతం విన్నారా?
అసలు ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా 'కంగువా'ను నిర్మిస్తున్నారని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. అందులో విజువల్ గ్రాండియర్ కనిపించింది. టీజర్, ఆ విజువల్స్ అంతా ఒక ఎత్తు... దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య గీతం మరో ఎత్తు. కంగ, కంగ, కంగువా... అంటూ గూస్ బంప్స్ వచ్చే మ్యూజిక్ అందించారు ఆయన. దేవి శ్రీ ప్రసాద్ కొత్త తరహా సంగీతాన్ని వినిపించారు. దాంతో ఆయన పాటలపై కూడా అంచనాలు పెరిగాయి.  


Also Read : 'సైంధవ్'లో ఎమోషనల్ క్లైమాక్స్ - వెంకటేష్ కెరీర్‌లో ఖర్చు ఎక్కువైంది దీనికే!


'కంగువా' చిత్రానికి కూర్పు : నిశాద్ యూసుఫ్, పోరాటాలు : సుప్రీమ్ సుందర్, మాటలు : మదన్ కార్కే (తమిళంలో) మాటలు : ఆది నారాయణ (తెలుగులో), పాటలు : వివేక్ - మదన్ కార్కే, కాస్ట్యూమ్ డిజైనర్ : అను వర్థన్ - దష్ట పిల్లై, కాస్ట్యూమ్స్ : రాజన్, నృత్యాలు : శోభి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత :ఏజే రాజా, సహ నిర్మాత : నేహా జ్ఞానవేల్ రాజా, నిర్మాతలు : కేఈ జ్ఞానవేల్ రాజా - వంశీ - ప్రమోద్, దర్శకత్వం : శివ. 


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial