Kangana Ranaut Seeks Blessings From Sadhguru in Coimbatore : బాలీవుడ్ న‌టి, ఎంపీ కంగ‌నా ర‌నౌత్ స‌ద్గురు ఫాలోవ‌ర్. ఆమె చాలాసార్లు అక్క‌డికి వెళ్లి వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఎంపీగా గెలిచిన ఆమె సద్గురుని కలిశారు.కోయంబ‌త్తూర్ లోని ఇషా ఫౌండేష‌న్ ఆశ్ర‌మానికి వెళ్లిన కంగ‌నా ఆయ‌న్ను క‌లిసి ఆశిస్సులు తీసుకున్నారు. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు షేర్ చేశారు కంగ‌నా. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని మండీ నుంచి బిజేపీ ఎంపీగా గెలిచారు కంగ‌నా ర‌నౌత్.


పింక్ చీర‌లో మెరిసిపోయిన కంగ‌నా.. 


కంగ‌నా ర‌నౌత్ స‌ద్గురును క‌లిసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దాంట్లో కంగ‌నా చ‌క్క‌గా పింక్ చీర క‌ట్టుకుని సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో క‌నిపించారు. స‌ద్గురు కుర్చీలో కూర్చొని ఉండ‌గా.. ఆమె కింద కూర్చుని ఉన్న ఫొటోలు షేర్ చేశారు కంగ‌నా. ఇషా సెంట‌ర్ లోని పెద్ద శివుని విగ్ర‌హం ద‌గ్గ‌రి ఫొటోలు షేర్ చేస్తూ.. ఇషా సెంట‌ర్ హ్యాపీ ప్లేస్ అంటూ పోస్ట్ చేశారు ఆమె. 


ఫ‌స్ట్ టైమ్ ఎంపీ.. 


ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి చాలామంది కొత్త ఎంపీలు పార్ల‌మెంట్ ఎన్నిక‌య్యారు. వారిలో ఒక‌రు కంగ‌నా ర‌నౌత్. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మండీ నుంచి ఆమె లోక్ స‌భ‌కు ఎన్నిక‌య్యారు. త‌న ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి విక్ర‌మాదిత్య సింగ్ పైన 74,755 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు కంగ‌నా. నా మాతృభూమి న‌న్ను వెన‌క్కి పిలిచింది. అందుకే, ఇంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించాను అని త‌న స‌న్నిహితుల ద‌గ్గ‌ర ఎమోష‌న‌ల్ అయ్యారంట కంగ‌నా. 


అనుకోకుండా ఎంపీ.. 


బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ర‌నౌత్.. ఎప్పుడూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ లో ఉంటూనే ఉంటారు. ప్ర‌తి విష‌యంపై స్పందిస్తూ త‌న మ‌న‌సులో అనిపించింది మాట్లాడుతుంటారు. అలాంటిది ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఆమెకు మండీ టికెట్ అనౌన్స్ చేసిన త‌ర్వాతే కంగ‌నా బీజేపీలో చేరారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆమె చాలా కాంట్ర‌వ‌ర్సీ స్టేట్ మెంట్స్ చేసి వార్త‌ల్లో నిలిచారు. 


చెంప‌దెబ్బ దుమారం


ఇక ఎంపీగా గెలిచిన త‌ర్వాత కూడా కంగ‌నా ర‌నౌత్ వార్త‌ల్లో నిలిచారు. ఆమెను ఒక కానిస్టేబుల్ కుల్వింద‌ర్ కౌర్ కొట్ట‌డంతో పెద్ద దుమారం రేగిన విష‌యం తెలిసిందే. గ‌తంలో ఆందోళ‌న చేసిన రైతుల‌పై కంగ‌నా విమ‌ర్శ‌లు చేసిన నేప‌థ్యంలో ఎయిర్ పోర్ట్ లో ఆమెపై దాడి చేసిన‌ట్లు  కుల్వింద‌ర్ కౌర్ చెప్పింది. ప్ర‌స్తుతం ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు. 


సినిమాల విష‌యానికొస్తే.. పోయిన ఏడాది కంగ‌నా ర‌నౌత్ కి పెద్ద‌గా హిట్లు ప‌డ‌లేదు. కాగా.. ఇప్పుడు ఆమె ఎలాంటి సినిమాల‌ను అనౌన్స్ చేయ‌లేదు. కాగా.. ఇప్ప‌టికే న‌టించిన 'ఎమ‌ర్జెన్సీ' సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. పొలిటిక‌ల్ నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డంతో రిలీజ్ కి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతేకాకుండా కొన్ని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మిగిలి ఉన్న‌ట్లు స‌మాచారం. ఎమ‌ర్జెన్సీ టైంలో ఇండియాలో ఉన్న ప‌రిస్థితులపై ఈ సినిమా తెర‌కెక్కించారు. దీంట్లో కంగ‌నా ఇందిరా గాంధీగా న‌టించారు. 


Also Read: మోదీ, చిరు మాత్రమే కాదు - చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఈ స్టార్ హీరో కూడా