Surekha Vani Click With Orry Awatramani in a Party: టాలీవుడ్‌ సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకం పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ క్రేజ్‌ సంపాదించుకున్న ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. లాక్‌డౌన్‌లో తన కూతురు సుప్రితతో సోషల్‌ మీడియాలో ఆమె చేసిన రచ్చ అంతా ఇంత కాదు. తరచూ డ్యాన్స్‌ వీడియో, రీల్స్ షేర్‌ చేస్తూ నెట్టింట తెగ హంగామా చేసింది. దాంతో అప్పట్లో తరచూ ఆమె వార్తల్లో నిలిచేంది. అయితే ఈ మధ్య సురేఖ వాణి సైలెంట్‌ అయిపోయింది.


ఒకప్పుడు సోషల్‌ మీడియా, మీడియాల్లో నిలిచే ఆమె అసలు బయట కనిపించడం లేదు. ఒకప్పుడు తన గ్లామర్‌ లుక్‌తో వెండితెరపై అలరించిన ఆమె సందడి వెండితెరపై కరువైంది. కొద్దిరోజులుగా నెట్టింట కూడా కనిపించని ఆమె తాజాగా ఓ పార్టీలో తళుక్కున మెరిసింది. అతడి కూడా ఓ వ్యక్తి అతిసన్నిహితంగా కనిపించింది. అతను ఎవరా అని ఆరా తీయగా అసలు విషయం తెలిసిందే. కాగా సురేఖ్‌ వాణి రీసెంట్‌గా ఓ మూవీ ఈవెంట్‌కి హాజరైనట్టుంది. అది కూడా బాలీవుడ్‌ స్టార్స్‌తో కలిసి ఈ పార్టీలో సందడి చేసింది. ఈ సందర్భంగా ప్రముఖ వ్యక్తితో సురేఖ వాణి క్లోజ్‌ ఫోటో తీగడంతో నెట్టింట మొత్తం ఆమె గురించే చర్చించుకుంటున్నారు.


అతడు మరెవరో కాదు బాలీవుడ్‌ ఫేమస్‌ స్టార్, సెలబ్రిటిస్‌ ఫ్రెండ్‌ ఓరీ అవ్రతమణి. సింపుల్‌గా అతడిని ఓరీ అని పిలుస్తాంటారు. టాలీవుడ్‌ ఇతడు గురించి పెద్దగా పరిచయం లేదు. కానీ సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యేవారికి ఇతడు బాగా సుపరిచితం. బి-టౌన్‌లో సెలబ్రిటీస్‌, రిచ్‌ పార్టీస్‌లో ఓరీ స్పెషల్‌ అట్రాక్షన్‌ ఇస్తుంటాడు. అంతేకాదు సెలబ్రిటీలపై చేయి వేసి దిగడం అతడి ప్రత్యేకత. ఏరికోరి మరి ఓరీని మీద చేయి వేయించుకుంటారట. అతడి చేయి పడితే వారికి  కలిసోస్తుందనేది సెలబ్రిటీల నమ్మకం. అందుకే ఓరీ ఒక్కసారైనా ఇలా క్లోజ్‌గా దిగేందుకు స్టార్స్‌ ఆసక్తి చూపుతారు. ఇక ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఓరీ లక్షల్లో వసూళ్లు చేస్తాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. అంతగా బాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన ఓరీతో ఇప్పుడు సురేఖ వాణి ఫోటో దిగడం చర్చనీయాంశమైంది. ఇంతవరకు ఏ తెలుగు నటి కూడా ఓరీతో ఫోటోలు దిగలేదు. 



అలాంటిది సురేఖ వాణి అతడితో చేయి వేయించుకుని మరి ఫోటోకు ఫోజులు ఇచ్చి దీనిని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకుంది. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ ఫోటోతో మరోసారి సురేఖ వాణి వార్తల్లో నిలిచింది. కాగా ఈ ఫోటో ముంబైలోని ఓ పార్టీలో దిగినట్టు తెలుస్తోంది. కాగా ఓరీ బాలీవుడ్‌ స్టార్‌ కిడ్స్‌తో సన్నిహితంగా ఉంటాడు. తరచూ అతడు జాన్వీ కపూర్‌, సారా అలీ ఖాన్‌, నైసా దేవగన్‌(అజయ్‌ దేవగన్‌, కాజోల్‌ కూతురు), అనన్య పాండే, ఆర్యన్‌ ఖాన్‌ వంటి స్టార్‌ కిడ్స్‌తో పార్టీలకు హాజరవుతుంటాడు. ఈ సందర్భంగా వారితో కలిసి క్లోజ్‌గా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఫేమస్‌ అయ్యాడు. ఇక గత మార్చిలో జరిగిన ముఖేష్‌ అంబానీ, నితా అంబాని కొడకు అనంత్‌ అంబాని-రాధికల ప్రీవెడ్డింగ్‌ వేడుకలో కూడా ఓరీ సందడి చేసిన సంగతి తెలిసిందే.


Also Read: నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ ఇంట విడాకుల రచ్చ - భార్యకు మరో వ్యక్తితో ఎఫైర్, యంగ్‌ హీరో తీవ్ర ఆరోపణలు