కమల్ హాసన్ మాజీ భార్య, ప్రముఖ కథానాయిక శృతి హాసన్ తల్లి సారిక తెలుసు కదా! గతంలో ఆమె కథానాయికగా సినిమాలు చేశారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు. అయితే, ఐదేళ్లుగా ఆమె బ్రేక్ తీసుకున్నారు. తొలుత ఇంత లాంగ్ బ్రేక్ తీసుకోవాలని అనుకోలేదట. ఓ ఏడాది బ్రేక్ తీసుకోవాలని అనుకున్నారట. కరోనా కారణంగా ఆ బ్రేక్ కొనసాగిందని ఆమె తెలిపారు. కాకపోతే... కరోనా కాలంలో డబ్బులు లేక ఫైనాన్సియల్ స్ట్రగుల్స్ ఫేస్ చేశానని సారిక చెప్పుకొచ్చారు.
''జీవితాన్ని వేస్ట్ చేస్తున్నాని అనిపించింది. ప్రతి రోజూ ఉదయం నిద్రలేస్తా. మనం అనుకున్న పనులు జరగవు. మళ్ళీ నిద్రపోతా. అందుకని, ఒక ఏడాది బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాను. డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలని అనుకున్నాను. ఆ ఒక్క ఏడాది కాస్తా ఐదేళ్లు అయ్యింది. లాక్ డౌన్ వచ్చింది. చేతిలో డబ్బులు అయిపోయాయి. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ యాక్టింగ్ చేయాలి. థియేటర్ (స్టేజి షోలు) చేస్తే... రోజుకు రూ. 2000 - రూ. 2700 వస్తాయి. అంతకు మించి ఏం చేయలేం. అందువల్లే, కనిపించలేదు. మనస్ఫూర్తిగా ఏడాది బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా. ఐదేళ్లు అయ్యింది. ఆ ఐదేళ్లు గొప్పగా గడిచాయి'' అని సారిక చెప్పారు.
Also Read: 'మనీ హీస్ట్'లో మహేష్ బాబు ఏ రోల్ చేస్తారంటే?
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ కోసం రూపొందిన వెబ్ సిరీస్ 'మోడ్రన్ లవ్: ముంబై'తో సారిక రీఎంట్రీ ఇస్తున్నారు. మే 13న ఈ వెబ్ సిరీస్ టెలికాస్ట్ కానుంది. సూరజ్ బర్జాత్యా సినిమాలో కూడా సారిక నటిస్తున్నారు.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఫోనులో మాట్లాడిన మహేష్