ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా సింపుల్ పర్సన్ అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోలు కొందరు ఆ మధ్య జ‌గ‌న్‌తో కలిసిన సంగతి తెలిసిందే. 'సర్కారు వారి పాట' విడుదల సందర్భంగా మీడియాతో మహేష్ ముచ్చటించారు. అప్పుడు ఏపీ సీఎంతో మీటింగ్ గురించి ప్రస్తావన వచ్చింది.


''అంతకు ముందు జగన్ గారితో అప్పుడప్పుడూ ఫోనులో మాట్లాడాను. అందరితో కలిసి మీటింగ్ కు వెళ్ళినప్పుడే తొలిసారి కలవడం. ఆయన చాలా సింపుల్ పర్సన్. ఒక సీఎం అంత సింపుల్ గా ఉండటం చూసి స‌ర్‌ప్రైజ్‌ అయ్యా. ఆయన మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. మేమంతా ఎలా కలుస్తాం? అని అడిగారు. ఇండస్ట్రీ విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆసక్తి చూపించారు. సానుకూలంగా స్పందించారు'' అని జగన్ గురించి మహేష్ చెప్పారు.


Also Read: సుధీర్ బాబుతో ఈషా రెబ్బా, మృణాళిని రవి - హైదరాబాద్‌లో
 
'సర్కారు వారి పాట' (Sarkaru Vaari Paata) అభిమానులు, ప్రేక్షకులు అందరినీ అలరించేలా ఉంటుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఆయన క్యారెక్టరైజేషన్ పోకిరి తరహాలో ఉంటుందని, కీర్తీ సురేష్‌తో లవ్ ట్రాక్ సినిమాలోని హైలైట్స్‌లో ఒకటి అవుతుందని మహేష్ అన్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read: ఆ నిర్ణయం నాది కాదు & గౌతమ్ వేరు, సితార వేరు! - పిల్లల గురించి మహేష్ బాబు ఏమన్నారంటే?