Rare pic of Nag Ashwin and Vijay Deverakonda goes viral: 'కల్కీ 2898 ఏడీ' సినిమా.. ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ సినిమా గురించే చర్చ జరుగుతోంది. కారణం అంతలా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది సినిమా. ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా, కమల్ హాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, వాళ్లతో పాటు మరికొంతమంది గెస్ట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలో. వాళ్లలో విజయ దేవరకొండ ఒకరు. అర్జునుడిగా చూపించారు విజయ దేవరకొండను నాగ్. ఇక ప్రస్తుతం వాళ్ల ఫ్రెండ్ షిప్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు.
వైరల్ అవుతున్న పిక్..
నాగ్ అశ్విన్ దర్శకుడిగా తీసిన మొదటి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఆ సినిమాలో విజయ దేవరకొండ కూడా యాక్ట్ చేశారు. కాగా.. ఇప్పుడు నాగ్ అశ్విన్, విజయ దేవరకొండ ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో నాగ్ అశ్విన్ చాలా బక్కగా, పెద్ద జుట్టుతో ఉన్నారు. ఇక రౌడీ బాయ్ కూడా చిన్న పిల్లాడిలా, సన్నగా కనిపించాడు. వాళ్లు ఏదో పార్టీలో ఆ ఫొటో దిగినట్లు కనిపిస్తోంది. ఇక ఆ ఫొటోలో నాగ్ అశ్విన్ ని చూసిన నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. అదేంటీ అలా ఉన్నారంటూ సరద కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి సినిమాలో విజయ్...
నాగ్ అశ్విన్ తీసిన ప్రతి సినిమాలో విజయ్ దేవరకొండ ఉన్నారు. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నానితో పాటు విజయ్ దేవరకొండ కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఆ తర్వాత సావిత్ర జీవిత కథ ఆధారంగా తీసిన 'మహానటి' సినిమాలో విజయ్ ప్రధాన ప్రాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు 'కల్కీ 2898 ఏడీ'లో కూడా విజయ్ కనిపించారు. అలా మొదటి సినిమా నుంచి వాళ్ల ఫ్రెండ్ షిప్ కొనసాగుతూనే ఉంది.
నాగ్ యూనివర్స్ లో చేయడం తృప్తి నిచ్చింది..
ఇక 'కల్కీ 2898 ఏడీ'లో చేయడం తనకు చాలా తృప్తి నిచ్చిందని విజయ్ దేవరకొండ అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. చాలా ఎమోషనల్ గా ఉందని, తెలుగు సినిమా ఎక్కడికో వెళ్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నాగ్ యూనివర్సలో చేయడం ఆనందంగా ఉందని, అది చిన్న క్యారెక్టరా? పెద్ద క్యారెక్టరా? అనేది సంబంధం లేదని అన్నారు. ప్రభాస్ అన్న, నాగ్ అంటే ఇష్టం అని, వాళ్లకోసమే ఈ సినిమా చేశానని అన్నారు. నాగ్‌కు తాను లక్కీ చార్మ్ కాదని, ఆయన సినిమాలు బాగుంటాయని కితాబు ఇచ్చాడు రౌడీ బాయ్.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు దర్శక ధీరుడు రాజమౌళి, ఆర్జీవి, దుల్కర్ సల్మాన్, ఫరియా అబ్దుల్లా, మృణాల్ ఠాకూర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. వైజయంతి మూవీస్ తో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరు కనిపించారు 'కల్కీ 2898 ఏడీలో'.
Also Read: 'కల్కీ 2898 ఏడీ' చివర్లో కమల్ శ్రీశ్రీ కవిత్వం - 'ఆకలి రాజ్యం’ సినిమాలోనూ అదే సీన్, వీడియో వైరల్