Kajal Aggarwal: సౌత్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ గత రెండు దశాబ్దాలుగా సినీ అభిమానులను అలరిస్తోంది. కోవిడ్ పాండమిక్ టైంలో వివాహ బంధంలో అడుగుపెట్టిన ఈ భామ... పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ వస్తోంది. తన బాబు ఆలనా పాలనా చూసుకుంటూ, పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ‘సత్యభామ’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ ఇంస్టాగ్రామ్ లో నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా సోషల్ మీడియాలో పంచుకుంది. 


''ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఇయర్స్ అవుతుంది మీకు తెలుగులో 'అందరికీ నమస్కారం' తప్ప ఏమీ రాదేంటండి. ప్లీజ్ నాకోసం తెలుగులో ఆ నమస్కారం కాకుండా వేరేది ఏదైనా మాట్లాడండి'' అని కాజల్ అగర్వాల్ ను ఓ నెటిజన్ అడిగాడు. దీనికి ఫన్నీగా గతంలో పలు సినిమా ఈవెంట్స్ లో 'అందరికీ నమస్కారం' అంటూ మాట్లాడిన క్లిప్పింగ్స్ జత చేసిన కాజల్.. ''ఏం మాట్లాడుతున్నావ్? నాకు తెలుగు రాకపోవడం ఏంటి? ఇదేనా నా గురించి నీకు తెలిసింది. నా తెలుగు అంతా మనసులో ఉంటుంది. కాకపోతే తెలుగులో మాట్లాడాలి అంటే అది రైటా రాంగా అని డౌట్ వస్తుంది. కానీ నాకు తెలుగు బాగా తెలుసు. కెమెరా ముందు మాట్లాడకపోతే నాకు తెలుగు రానట్లే కదా. సరే, కావాలంటే ఈసారి 'సత్యభామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కువగా తెలుగులో మాట్లాడతాను'' అని బదులిచ్చింది. 


అలానే మరో నెటిజన్ ''థ్యాంక్స్ కాజల్ గారు.. మీకు పెళ్లి అయ్యాక అసలు సినిమాలు చెయ్యరేమో, ఇంక మిమ్మల్ని స్క్రీన్ మీద చూడనేమో అని చాలా ఫీల్ అయ్యాను. కానీ మళ్ళీ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చెయ్యడంతో చాలా హ్యాపీగా ఉంది'' అని కామెంట్ పెట్టాడు. దీనికి కాజల్ స్పందిస్తూ.. ''మీరు ఫీల్ అవ్వకండి. గ్యాప్ కావాలనే ఇచ్చాను. ఇప్పుడు 'సత్యభామ'తో ఇచ్చి పడేద్దాం'' అని సమాధానమిచ్చింది. ''మగధీర సినిమా నుంచి చూస్తున్నా, అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. మీ గ్లామర్ సీక్రెట్ చెప్తారా?'' అని అడగ్గా.. ''హ్యాపీగా ఉండు. మీ పక్కనే ఉన్న వాళ్లందరినీ హ్యాపీగా ఉంచు'' అని తెలిపింది. 






కాగా, 'సత్యభామ' సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవి వర్మ కీలక పాత్రలు పోషించారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మించారు. 'మేజర్' దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడమే కాకుండా, స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 31న థియేటర్లలో విడుదల కానుంది. మే 24న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. 


Also Read: 'రాక్షస' నుంచి ఆ స్టార్ హీరో తప్పుకున్నాడా? ‘హనుమాన్‌’ దర్శకుడితో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చాయా?