మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'దేవర' (Devara Movie). 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ అందుకున్న 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి చాలా రోజుల టైమ్ తీసుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ కొన్నాళ్ళు ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు సినిమా స్టేటస్ ఏంటి? ప్లానింగ్ ఎలా ఉంది? వంటి వివరాల్లోకి వెళితే...
నవంబర్ నెలాఖరుకు టాకీ పూర్తి!
Devara Movie Shooting Update : నవంబర్ నెలాఖరుకు 'దేవర' సినిమా టాకీ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ తర్వాత పాటల కోసం రెండు మూడు వారాలు కేటాయిస్తే చాలు! ఎలా లేదన్నా 2023 ఎండిండ్‌కు 'దేవర' షూటింగ్ వర్క్స్ నుంచి ఎన్టీఆర్ ఫ్రీ అవుతారని తెలుస్తోంది. ఈలోపు ఆయన కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్లే అవకాశం ఉంది.
'దేవర' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 'జనతా గ్యారేజ్' తర్వాత హీరోతో ఆయన చేస్తున్న చిత్రమిది. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు. యువ సంగీత సంచలన అనిరుధ్ రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ భార్య పాత్రలో సీరియల్ నటి చైత్ర రాయ్ నటిస్తున్నారు.
Also Read : 'సైతాన్' రివ్యూ : బోల్డ్ సీన్స్, బ్రూటల్ కిల్లింగ్స్ - హాట్‌స్టార్‌లో వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
'దేవర' తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో...
'దేవర' కాకుండా మరో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 'కెజియఫ్', ప్రభాస్ 'సలార్' సినిమాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అది ఈ ఏడాది సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. అందులో కథానాయికగా ప్రియాంకా చోప్రా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు 'వార్ 2' కూడా స్టార్ట్ చేయనున్నారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2'
హృతిక్ రోషన్ 'వార్'కు సీక్వెల్ రూపొందుతోంది. మొదటి భాగంలో టైగర్ ష్రాఫ్ నటించగా... రెండో భాగంలో ఎన్టీఆర్ నటించనున్నారు. ఆల్రెడీ 'యుద్ధభూమిలో కలుద్దాం' అంటూ హృతిక్, ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు పెంచాయి. 'వార్ 2'కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. దీనికి ప్రముఖ దర్శక - నిర్మాత, యశ్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రా కథ అందించారట.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన 'బ్రహ్మాస్త్ర' సినిమాకు దక్షిణాది భాషల్లో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరించారు. హైదరాబాద్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అథితిగా అటెండ్ అయ్యారు. అప్పుడు 'వార్ 2' గురించి డిస్కషన్ జరిగినట్టు సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమా, 'వార్ 2' తర్వాత పాన్ ఇండియా టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ సినిమాలు చేయనున్నారు.
Also Read : 'జీ కర్దా' రివ్యూ : ప్రేమకు, పెళ్లికి మధ్య డౌట్ వస్తే - తమన్నా వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?