Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ కావడంతో అభిమానులు అందరూ బాధలో ఉన్నారు. వాళ్ల కంటే మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంకా ఎక్కువ బాధలో ఉన్నారు. అభిమానులను నేరుగా కలుసుకునే అవకాశం మిస్ కావడంతో బాధాతప్త హృదయంతో ఆదివారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఆ వెంటనే అమెరికా ప్రయాణం అయ్యారు.
అమెరికా వెళ్ళిన ఎన్టీఆర్... దేవర ఈవెంట్స్ లేవు!
'దేవర' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, సినిమా విడుదలకు ఆల్మోస్ట్ 30 రోజుల ముందు నుంచి పబ్లిసిటీ చేస్తూ వస్తున్నారు ఎన్టీఆర్. ఆయన షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయ్యింది. దాని ప్రకారం ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన అమెరికా బయలు దేరారు. మళ్లీ ఇండియా తిరిగి వచ్చేది సెప్టెంబర్ 28 తర్వాతే. సో... తెలుగు రాష్ట్రాలలో దేవర సినిమాకు సంబంధించి భారీ ఫంక్షన్స్ గాని లేదా ఈవెంట్స్ గాని నిర్వహించే అవకాశం లేదు. ఒకవేళ నిర్వహించినా సరే దానికి ఎన్టీఆర్ వచ్చే అవకాశాలు అసలు లేవు.
సెప్టెంబర్ 26న అమెరికాలోని లాస్ ఏంజెల్స్ సిటీలో జరిగే బియాండ్ ఫెస్ట్ (Beyond Fest)కి ఎన్టీఆర్ హాజరు కానున్నారు. అక్కడ దేవర స్పెషల్ ప్రీమియర్ షో వేయడానికి ఏర్పాట్లు జరిగాయి. అందులో సందడి చేయడంతో పాటు హాలీవుడ్ మీడియా సంస్థలు కొన్నిటికి ఎన్టీఆర్ ఇంటర్వ్యూలు ఇవ్వనున్నారు. అందువల్ల సినిమా విడుదలకు ముందు ఆయన ఇండియా రావడం వీలు కాదు.
దేవర ఫంక్షన్ క్యాన్సిల్... మళ్లీ చేసే ఛాన్స్ లేదు!
ఆదివారం సాయంత్రం అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని సన్నాహాలు చేశారు. అయితే... ఫ్యాన్స్ ఎక్కువ మంది రావడం, పరిస్థితులు అదుపు తప్పడంతో ఫంక్షన్ క్యాన్సిల్ చేశారు. ఆ తరువాత తాను ఎంతగా బాధ పడుతున్నది వివరిస్తూ ఎన్టీఆర్ ఒక వీడియో విడుదల చేశారు.
Also Read: కుర్చీలు విరగొట్టిన ఫ్యాన్స్... 'దేవర' ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయ్యాక రచ్చ రచ్చ
హీరోయిన్ జాన్వి కపూర్ సైతం తెలుగులో మాట్లాడుతూ ఒక వీడియో విడుదల చేశారు. ముందుగా వేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్టీఆర్ అమెరికా వెళ్ళక తప్పలేదు. అందువల్ల తెలుగు రాష్ట్రాలలో సినిమా విడుదలకు ముందు మరో ఫంక్షన్ నిర్వహిస్తే బాగుంటుంది అని ఆలోచిస్తున్న అభిమానులు ఎవరైనా ఉంటే అటువంటి ఆశలు వదులుకోవడం మంచిది. ఒకవేళ ఎన్టీఆర్ సమక్షంలో 'దేవర' యూనిట్ ఏదైనా ఈవెంట్ చేయాలి అని అనుకుంటే సెప్టెంబర్ 30 తర్వాత వీలు అవుతుందని సమాచారం. ఈవెంట్ క్యాన్సిల్ కావడంలో నిర్మాతలు, నిర్వాహకులది తప్పు లేదని ఎన్టీఆర్ చెప్పినా అభిమానులు మాత్రం వాళ్ళ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.