తేజ పెళ్లి చేశానని ఎప్పుడూ చెప్పలేదని జేడీ చక్రవర్తి స్పష్టం చేశారు. అతను వేసిన ప్లాన్ నుంచి తప్పించుకుని వచ్చానని చెప్పాను తప్ప.. ఆయన పెళ్లి చేశాను, చేద్దామనుకున్నానని ఎప్పుడూ చెప్పలేదు.. అసలు తనకు ప్రమేయం లేదని తెలిపారు. తేజ చేసిన ఓ స్టుపిడ్ మిస్టేక్ ఏంటంటే.. 15, 20 ఏళ్ల కిందట సితార మ్యాగజైన్ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా చేసిన ఇంటర్వ్యూలో అతనే చెప్పాడు. తన పెళ్లి చేశానని, తన ప్రేమని గెలిపించానని, నెల్లూరు వెళ్లాం అని. కానీ అదేదీ నిజం కాదు. తేజ అలా చెప్పడం చూసి.. నిజానికి చాలా జాలేసింది.. అరెరే.. పాపం అనుకున్నా. ఇంకేం చేస్తాం.. అనుకున్నా. అతను చెప్పినవి చాలా తక్కువ గుర్తుంటాయి. ఎందుకంటే తేజ చెప్పిన వాటిలో చాలా తక్కువ నిజాలుంటాయి. అది అతనికి గుర్తు లేదేమో. తేజ అలా చెప్పాడు అంటే ఆ టైంలో అతను ఏదైనా ప్రాబ్లెంలో ఉండి ఉండాలి లేదంటే.. మైండ్ దొబ్బైనా ఉండాలని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరికైనా ఇంకా సందేహం ఉంటే ఆ ఇంటర్వ్యూను మళ్లీ చూడొచ్చు" అని జేడీ చక్రవర్తి చెప్పారు.


ఇదిలా ఉండగా జేడీ చక్రవర్తి ఇటీవలే 'దయా' సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దర్శకుడు పవన్ సాధినేని రూపొందించిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ సరసన ఈషా రెబ్బా నటించారు. ఆన్ లైన్ లో ఇటీవలే రిలీజైన ఈ సిరీస్.. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  ‘దయా’లో తాను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌గా కనిపిస్తానని, చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం తన పని అని జేడీ చక్రవర్తి తన పాత్రను గురించి రిలీజ్ కు ముందే వెల్లడించారు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుందని, పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదని, ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుందన్నారు. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయన్న ఆయన.. ఆ ఎమోషన్స్ అన్నీ ‘దయా’లో చూస్తారని చెప్పారు.


Read Also : King of Kotha Trailer: ‘కింగ్ ఆఫ్ కోథా’ ట్రైలర్: యజమానిని చూసి తోక ఊపే కుక్కలాంటిది ఈ కోథా - అదరగొట్టేసిన దుల్కర్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial