Music director Thaman was heavily trolled after the release of Jarugandi song from Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు బహుమతిగా 'గేమ్ ఛేంజర్' సినిమాలో 'జరగండి...' సాంగ్ విడుదల చేశారు. పాట విడుదలైన కొన్ని గంటల్లో సంగీత దర్శకుడు తమన్ మీద ట్రోలింగ్ మొదలైంది. కాపీ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు నెటిజనులు. ట్రోలింగ్ చేయడానికి కారణం ఏంటి? ఏ సాంగ్ కాపీ కొట్టారు? అనే వివరాల్లోకి వెళితే... 


ఎన్టీఆర్ 'శక్తి'లోని 'సుర్రో సుర్రో'కు కాపీ?
మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'శక్తి' సినిమా గుర్తు ఉందా? బాక్సాఫీస్ బరిలో హిట్ కాలేదు. కానీ, ఆ సినిమాలో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. మణిశర్మ మంచి బాణీలు అందించారు. అందులో 'సుర్రో సుర్రు...' పాటను ఇప్పటికీ వినే జనాలు ఉన్నారు. ఆ పాటను తమన్ కాపీ చేశాడని నెటిజన్ ఆరోపణ చేశారు. 'దొరికేశావ్ తమన్! ఎక్కడో విన్నట్టు ఉంది అనుకున్నా' అని రెండు సాంగ్స్ క్లిప్స్ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ 'ఎక్స్'లో ఒకరు పోస్ట్ చేశారు.


Also Read: తిరుమల గుడిలో ఫేస్ రివీల్ అయ్యిందిగా - రామ్ చరణ్ కూతుర్ని చూశారా?






మణిశర్మ దగ్గర తమన్ కొన్ని సినిమాలకు పని చేశారు. ఆ తర్వాత బయటకు వచ్చి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయన సూపర్ హిట్ చార్ట్ బస్టర్ సాంగ్స్ ఎన్నో ఇచ్చారు. అయితే, తమన్ నుంచి కొత్త సాంగ్ వచ్చిన ప్రతిసారీ ట్రోలింగ్ అనేది కామన్ అయిపోయింది. ఆయన మీద విమర్శలు రావడం సహజంగా మారింది.


రామ్ చరణ్ మీద యాంటీ ఫ్యాన్స్ ట్రోల్!
'జరగండి...' పాటతో పాటు అందులో రామ్ చరణ్ స్టైలింగ్, డ్యాన్స్ మీద సైతం యాంటీ ఫ్యాన్స్ కొందరు ట్రోల్ చేస్తున్నారు. వాళ్లకు రిప్లైలు ఇవ్వవద్దని, అలా ఇస్తూ ప్రజెంట్ బర్త్ డే మూడ్ స్పాయిల్ చేయవద్దని, ట్రోలర్స్ సంగతి రేపు చూసుకుందామని మెగా ఫ్యాన్ ఒకరు పేర్కొన్నారు.


Also Readపృథ్వీరాజ్ సుకుమారన్ 'ది గోట్ లైఫ్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - సినిమా ఎలా ఉందంటే?






'జరగండి...' సాంగ్ విడుదలకు ముందు నెట్టింట లీక్ అయ్యింది. తమన్ ఇచ్చిన ట్యూన్, లిరిక్స్ మీద అప్పుడే విమర్శలు వచ్చాయి. జాబిలమ్మ జాకెట్ వేసుకుని రావడం ఏమిటని కొందరు విమర్శించారు. ఇప్పుడు అఫీషియల్‌గా సాంగ్ రిలీజ్ చేయడంతో విమర్శలకు ట్రోలర్స్ మరింత పదును పెట్టారు. మరి, ఈ ట్రోల్స్ మీద తమన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Also Readపసుపు బదులు ముల్తానీ మట్టి - పెళ్లికి ముందు వేడుక వెరైటీగా ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్, రామ్ సినిమాల్లో హీరోయిన్