జపనీస్ సినిమాలు చూసే ప్రేక్షకులలో కొంత మందికి అయినా సరే మిజుకి ఇటాగకి (Mizuki Itagaki) తెలిసే ఉండొచ్చు. బాయ్ బ్యాండ్ మిల్క్ ద్వారా అతడు పాపులర్ అయ్యాడు. ఆ బ్యాండ్ మాజీ మెంబర్ అతను. ఆ తరువాత నటుడిగా తెర మీదకు వచ్చాడు. తాజాగా అతడు మరణించాడని సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. 

మూడు నెలలుగా మిజుకి మిస్సింగ్!జనవరిలో మిజుకి ఇటాగకి మిస్సింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ సమయంలోనే అతడికి మానసిక సమస్యలు ఉన్నట్టు తెలిసింది. ఆ తరువాత ప్రేక్షకులతో పాటు జపనీస్ మీడియా కూడా ఈ నటుడి గురించి మర్చిపోయింది. అయితే పోలీసులు మాత్రం దర్యాప్తు చేయడం ఆపలేదు. మిజుకి మిస్సింగ్ గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు.

జపాన్ రాజధాని టోక్యోలో మిజుకి ఇటాగకి బాడీ దొరికింది. కన్ఫర్మేషన్ కోసం అతడి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. అది తమ మిజుకి బాడీ అని తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో విషాదకర వార్తను ప్రేక్షకులతో షేర్ చేశారు. పాతికేళ్ళు నిండక ముందు ఇలా జరగడంతో ప్రేక్షకులు, అతని అభిమానులు 'అయ్యో పాపం' అనుకున్నారు.

Also Read: 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' రివ్యూ: కమర్షియల్ టెంప్లేట్‌లో తీసిన సినిమా... మదర్ & సన్‌ సెంటిమెంట్ హిట్ ఇస్తుందా?

దురదృష్టవశాత్తు మిజుకి ఇటాగకి మరణించాడని అతని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అతనికి ఎంతో మద్దతు ఇచ్చిన ప్రేక్షకులకు, అతనితో పని చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అతని మరణం పట్ల సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Also Read: ఎవరీ ప్రియాంక? రెండో పెళ్లి చేసుకుంటే ఎందుకంత డిస్కషన్... వశీతో బిగ్ బాస్ బ్యూటీ ప్రేమకథ తెల్సా?