అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) భాగ్య నగరంలో.... అదేనండీ హైదరాబాదులో అడుగు పెట్టారు. మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఆమె కథానాయికగా ఎంపికైన సంగతి తెలిసిందే. ఆ సినిమా కోసమే జాన్వీ కపూర్ హైదరాబాద్ వచ్చినట్లు తెలిసింది.


తెలుగులో జాన్వీకి తొలి చిత్రమిది!
మరాఠీ సూపర్ హిట్ సినిమా 'సైరాట్' హిందీ రీమేక్ 'ధాకడ్'తో హిందీ చిత్రసీమకు కథానాయికగా పరిచయమైన జాన్వీ కపూర్... ఇప్పటి వరకు అర డజను సినిమాలు చేశారు. అయితే... తెలుగు తెరకు ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాతో పరిచయం అవుతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులనూ ఆమె పలకరించనున్నారు. 


రామోజీ ఫిల్మ్ సిటీలో నయా షెడ్యూల్!
మార్చి నెలాఖరున, శ్రీరామ నవమి తర్వాత రోజు నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాదులోనే చేశారు. హీరో మీద కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. రెండో షెడ్యూల్ గోవాలో ఉంటుందని వినిపించింది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... సోమవారం (ఏప్రిల్ 17వ తేదీ) నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుందట. 


సైఫ్ అలీ ఖాన్ కూడా... 
ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ అనే విషయం కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ( NTR 30 Villain) కు ఢీ కొనే బలమైన ప్రతినాయకుడి పాత్రలో నవాబ్ వారసుడు కనిపించనున్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల అగ్రిమెంట్ పేపర్స్ మీద సైఫ్ సంతకం చేసేశారట. రెండో షెడ్యూల్ కోసం ఆయన కూడా హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది.


Also Read ఆ పబ్‌లో తెలుగు పాటలే వినబడతాయ్ - వర్మ మెచ్చిన బీర్ టెయిల్


''అప్పుడప్పుడూ ధైర్యానికి కూడా తెలియదు.... అవసరానికి మించి తను ఉండకూడదు అని! అప్పుడు భయానికి తెలియాలి... తను రావాల్సిన సమయం వచ్చిందని! వస్తున్నా'' అని ఎన్టీఆర్ 30 టీజర్‌లో తారక్ చెప్పిన డైలాగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 


ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా వీఎఫ్ఎక్స్, స్టంట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు. 


కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిందీలో 'వార్ 2' సినిమా (War 2 Movie) షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో ఆయన కనిపిస్తారట. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎన్టీఆర్ హీరోగా పాన్ ఇండియా సినిమా స్టార్ట్ కానుంది. 


Also Read : గల్వాన్ లోయ ఘటనపై సినిమా - తెరపైకి భారత సైనికుల వీరగాథలు