Akhil Akkineni: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని రీసెంట్ గా నటించిన సినిమా ‘ఏజెంట్’. ఈ మూవీకు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మూవీ టీమ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా సమాధానాలు చెబుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమోషన్స్ కార్యక్రమంలో అఖిల్ అక్కినేని కు ఓ ప్రశ్న ఎదురైంది. ఇటీవల అక్కినేని నాగ చైతన్య డేటింగ్ గురించి వస్తోన్న వార్తలపై అఖిల్ స్పందన ఏంటి అని అడగ్గా.. దానికి అఖిల్ తెలివిగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం అఖిల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, ప్రముఖ నటి శోభిత దూళిపాల గత కొంత కాలంగా డేటింగ్ లో ఉంటున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదట్లో ఇదంతా కేవలం పుకార్లు అని కొట్టిపారుశారు నెటిజన్స్. అయితే తర్వాత అందుకు సంబంధించిన పలు షోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీరి డేటింగ్ వ్యవహారం పలు మార్లు చర్చల్లోకి వచ్చింది. ఇటీవలే లండన్ హోటల్ లో నాగ చైతన్య దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. ఈ ఫోటోలో వెనుక టేబుల్ దగ్గర శోభిత ధూళిపాల కూర్చొని ఉంది. దీంతో నెటిజన్స్ ఆమె శోభితానేనని, వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయం పై అఖిల్ అక్కినేని ను ప్రశ్నించారు మీడియా మిత్రలు. ‘మీ అన్న చైతన్య ఎవరో అమ్మాయితో ఉన్న ఫోటోలతో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి?’ అని అడిగారు.
ఆ ప్రశ్నకు అఖిల్ బదులిస్తూ.. ‘‘నా పరిస్థితి ‘ఏజెంట్’ మూవీ. గత రెండేళ్లుగా జుట్టు, బాడీ మెయింటైన్ చేయడమే సరిపోయింది నాకు. నా ఫోకస్ అంతా సినిమాలపైనే’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే నాగ చైతన్య డేటింగ్ వార్తలపై మాత్రం అఖిల్ స్పందించలేదు. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు అఖిల్. ఆయన కెరీర్ లో ఎన్నో సినిమాలు చేసినా అవేమీ అఖిల్ కు స్టార్ డమ్ ను తెచ్చిపెట్టలేకపోయాయి. మధ్యలో కొన్ని సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నా అవి కమర్షియల్ గా నిలబడలేకపోయాయి. దీంతో ఈ సారి ‘ఏజెంట్’ మూవీతో ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలి అని ఎదురు చూస్తున్నారు అఖిల్. అందుకే ఈ మూవీ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర వహిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయకగా కనిపించనుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా మూవీను నిర్మించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ ను ఏప్రిల్ 18 న కాకినాడ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 28 న సినిమాను పలు భాషల్లో పాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారు.
Read Also: బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన ‘శాకుంతలం’ - మరీ ఇంత తక్కువ?