ప్రముఖ మలయాళ కథానాయకుడు, కేంద్ర ప్రభుత్వంలో పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న బిజెపి ఎంపీ సురేష్ గోపి (Suresh Gopi)కి సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చింది. దాంతో ఆయన కథానాయకుడికి నటించిన తాజా సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (Janaki VS State Of Kerala Movie) విడుదల‌ డైలమాలో పడింది.

Continues below advertisement


జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ...
అసలు సినిమా కాంట్రవర్సీ ఏమిటి?
సురేష్ గోపి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఇందులో ఆయనకి లాయర్ రోల్‌. తెలుగు ప్రేక్షకులకు సైతం తెలిసిన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక కీలక పాత్ర చేశారు.‌ ఆమె జానకిగా నటించారు. 


లైంగిక వేధింపులకు గురైన అమ్మాయి జానకి.‌ తనకు న్యాయం కావాలని కోర్టు మెట్లు ఎక్కుతుంది. కోర్టులో ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే, లైంగిక వేధింపులకు గురైన అమ్మాయికి జానకి పేరు పెట్టడం పట్ల సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది.


కేరళ సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్నల్...
కానీ ముంబై ఆఫీసు నుంచి మార్పులు!
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' సినిమా సెన్సార్ మే 22న కంప్లీట్ అయింది. కేరళలోని తిరువనంతపురంలో రీజనల్ సెన్సార్ బోర్డు నుంచి సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ లభించింది. జూన్ 27న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే మే 23న ముంబైలో సెన్సార్ బోర్డు హెడ్ ఆఫీస్ నుంచి చిత్ర దర్శక నిర్మాతలకు టైటిల్, అలాగే సినిమాలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయి పేరు మార్చాలని సూచన వచ్చింది. 


Also Readబీచ్... బికినీ... ఫ్యామిలీ... సంతోషంగా కాజల్ బర్త్‌డే సెలబ్రేషన్స్... ఫోటోలు చూడండి


రామాయణంలో సీతా దేవికి మరొక పేరు జానకి. హిందువులు దైవంగా కొలిచే జానకి పేరును, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న అమ్మాయికి పెట్టడం మంచిది కాదని, ఆ పేరు మార్చరాలని సూచించారు. దీని మీద దర్శకుడు ఎంబీ పద్మకుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 


''సినిమాలో క్యారెక్టర్ పేరు జానకి అబ్రహం. రీజనల్ సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ వచ్చింది. అయితే ఫీచర్ ఫిల్మ్ కనుక ముంబై ఆఫీసుకు సినిమాను పంపించారు. అక్కడ నుంచి పేరు మార్చమని వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. జానకి, అబ్రహమ్ మధ్య రిలేషన్షిప్ పట్ల వాళ్లకు ప్రాబ్లమ్ ఉన్నట్టు ఉంది. కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయం తెలుసు అని అనుకోవడం లేదు'' అని పద్మ కుమార్ తెలిపారు. ఈ అంశం పట్ల సురేష్ గోపి ఇంకా స్పందించలేదు.


Also Read: ఆడియన్స్‌ను టీజ్ చేస్తున్న నభా నటేష్... బికినీ కనిపించీ కనిపించకుండా కోట్ వేసి