కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించి చాలా రికార్డ్స్ బద్దలు కొట్టింది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 10న తమిళ, తెలుగు భాషల్లో విడుదలై సెన్సేషనల్ హిట్ ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.650 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించి తమిళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ గ్రాఫర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాని నిర్మించిన కళానిధి మారన్ కి భారీగా లాభాలు రావడంతో 'జైలర్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా సినిమా కోసం పని చేసిన వారికి బహుమతులు ఇస్తూనే ఉన్నారు.


ఈ క్రమంలోనే తాజాగా ఈ 'జైలర్' కోసం పనిచేసిన 300 మందికి పైగా వ్యక్తులకు నేడు గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. అంతేకాదు వాళ్ళందరికీ ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఓ ఈవెంట్ నిర్వహించి భారీ కేక్ కట్ చేశారు. గోల్డ్ కాయిన్స్ ఇచ్చాక వాళ్ళ అందరితో కలిసి కూర్చుని భోజనం కూడా చేశారు. ఈ ఈవెంట్ లో నిర్మాత కలానికి మారన్ తో పాటు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సన్ పిక్చర్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ మేరకు '300 మందికి పైగా వ్యక్తులను గోల్డ్ కాయిన్స్ తో నిర్మాత సన్మానించారని పేర్కొంది'. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.






దీనికంటే ముందు 'జైలర్' మూవీలో హీరోగా నటించిన రజినీకాంత్ కి బీఎండబ్ల్యూ, డైరెక్టర్ నెల్సన్ నెల్సన్ దిలీప్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ లకు లగ్జరీ ఫోర్సే కార్లు బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. ఈ క్రమంలోనే రజనీకాంత్, అనిరుద్ లకి చెక్ లను అందజేశారు. రజనీకాంత్ కైతే భారీ మొత్తంలో చెక్ ఇచ్చారని తెలుస్తోంది. సాధారణంగా ఓ సినిమా హిట్ అయితే నిర్మాత చాలా సంతోషిస్తారు. తెలుగు నిర్మాతలు అయితే సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువ విజయం సాధిస్తే హీరోకి లేదా డైరెక్టర్ కి ఖరీదైన కారుని గిఫ్టుగా ఇస్తుంటారు. కానీ జైలర్ నిర్మాత కళానిధి మారన్ మాత్రం జైలర్ స్టార్ కాస్ట్ కి కార్లు గిఫ్ట్లుగా ఇవ్వడంతో పాటు సినిమాకి పనిచేసిన 300 మందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ప్రత్యేక విందును ఏర్పాటు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.


ఇక జైలర్ మూవీలో సీనియర్ నటి రమ్యకృష్ణ, తమన్నా, వసంత్ రవి, మీర్నామీనన్, యోగి బాబు, సునీల్ కీలకపాత్రను పోషించగా, తమిళ నటుడు వినాయకన్ విలన్ గా నటించారు. మలయాళ స్టార్ మోహన్లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ గెస్ట్ రోల్స్ తో ఆకట్టుకున్నారు. థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కి అందుబాటులో వచ్చింది. తమిళ, తెలుగు భాషలతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాతో సహా మరికొన్ని దేశాల్లోనూ ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో 'జైలర్' ప్రస్తుతం ట్రెండింగ్లో ఉండటం విశేషం.


Also Read : ఆ పాట వల్ల టీటీ ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వచ్చింది: షూటింగ్ సమయంలో కష్టాలు గుర్తుచేసుకున్న రవీనా



Join Us on Telegram: https://t.me/abpdesamofficial