'ఊ అంటావా మావ... ఊఊ అంటావా మావ' - 'పుష్ప: ది రైజ్'లో స్టార్ హీరోయిన్ సమంత చేసిన ఈ స్పెషల్ సాంగ్ ఎంత హిట్ అయ్యిందనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ పాట హుక్ లైన్ టైటిల్‌గా సినిమా వస్తోంది. ఒక విధంగా పాట క్రేజ్ అంతలా ఉందని చెప్పవచ్చు. మరొక విధంగా జనాలను ఆకర్షించడానికి ఆ టైటిల్ పెట్టారని అనుకోవచ్చు. ఈ సినిమాతో 'జబర్దస్త్' రాకేష్ హీరోగా, నటి సత్యకృష్ణ కుమార్తె అనన్య కథానాయికగా పరిచయం అవుతున్నారు.
యశ్వంత్, 'జబర్దస్త్' రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా 'ఊ అంటావా మావ... ఊఊ అంటావా మావ'. శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై తుమ్మల ప్రసన్న కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి రేలంగి నరసింహారావు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు చేసిన ఆయన... కొంత విరామం తర్వాత దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.
రెండు పాటలు మినహా 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, త్వరలో ఆ రెండిటిని కశ్మీర్ లోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని చిత్ర బృందం పేర్కొంది.
''ఇప్పటి వరకు చేసిన కామెడీ సినిమాలకు భిన్నంగా మా 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సినిమా ఉంటుంది. ఇదొక హారర్ కామెడీ సినిమా. కామెడీతో కూడుకున్న హారర్ ఉంటుంది. అంతే తప్ప... కంప్లీట్ హారర్ ఉండదు'' అని రేలంగి నరసింహరావు తెలిపారు.
Also Read : తలలు కోసి చేతికిస్తా నాయాలా - మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మాస్ మామూలుగా లేదుగా
కశ్మీర్ లో పాటల చిత్రీకరణతో సినిమా షూటింగ్ కంప్లీట్ అవుతుందని, జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మల ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీత దర్శకుడు. అంగిరెడ్డి శ్రీనివాస్ సంభాషణలు అందించారు.
Also Read : కవలలు పుట్టారు, అప్పుడే పేర్లు కూడా పెట్టేశారు - తల్లిదండ్రులైన చిన్మయి, రాహుల్ రవీంద్రన్ దంపతులు