Robert Downey Jr. Birthday Special: ప్రముఖ హాలీవుడ్ స్టార్ రాబర్ట్ డౌనీ జూనియర్ ఈరోజు (ఏప్రిల్ 4 ) తన 58వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. యాభై ఏళ్ల తన సినీ కెరీర్‌లో రాబర్ట్ అద్భుతమైన నటనకు గానూ ఎన్నో రివార్డులతో పాటు అవార్డులు కూడా అందుకున్నారు. ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఇప్పటి వరకు ఎన్నో సెన్సేషన్ సినిమాలు చేశారు. ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తయితే.. 'మార్వెల్ చిత్రాలు' మరొక ఎత్తు. టోనీ స్టార్క్ అకా 'ఐరన్‌మ్యాన్‌'గా అసాధారణమైన పాత్ర పోషించి, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. 


నేటితో రాబర్ట్ డౌనీ పుట్టి58ఏళ్లు పూర్తయిన సందర్భంగా...  ఆయన నటించిన' ఐరన్ మ్యాన్' పాత్రతో పాటు మరికొన్ని ప్రసిద్ధ చలనచిత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.


1. చాప్లిన్


ఈ సినిమా 1992లో విడుదలైంది. ఈ మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రముఖ నటుడు, చిత్ర నిర్మాత 'చార్లీ చాప్లిన్' పాత్రను పోషించారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వంలో వచ్చిన  ఈ లెజెండ్ బయోపిక్ లో చాప్లిన్ జీవితాన్ని చక్కగా చూపించారు. అంతే కాకుండా రాబర్ట్ డౌనీ జూనియర్ ప్రదర్శించిన అద్భుతమైన నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు అప్పట్లో అనేక అనేక అవార్డులు రాగా, విమర్శకుల చేత ప్రశంసలు కూడా పొందింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. మీరు ఒకవేళ చూడకపోయినా లేదా మళ్లీ చూడాలనుకుంటే చూడండి.


2. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్


షేన్ బ్లాక్ దర్శకత్వం వహించిన నియో-నోయిర్ రూపొందించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌ మూవీలో రాబర్ట్ డౌనీ జూనియర్ 'హారోల్డ్ లాక్‌హార్ట్ అకా హ్యారీ' పాత్రలో నటించారు. ఈ మూవీలో ఓ క్రిమినల్ అనుకోకుండా ఓ సినిమా కోసం నిర్వహించిన స్క్రీన్ టెస్ట్‌లో గెలుస్తాడు. అతని వ్యంగ్యాత్మకమైన ఇంకా సాపేక్షమైన హ్యారీ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు నచ్చుతుంది. ఈ మూవీలో రాబర్ట్ తో పాటు వాల్ కిల్మెర్‌ కూడా నటించారు. వీరిద్దరి స్నేహం చూడడానికి ముచ్చటగా అనిపిస్తుంది. 'కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్' సైతం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.


3. ఐరన్ మ్యాన్


2008లో థియేటర్లలోకి వచ్చిన మార్వెల్ చిత్రం మొదటి పార్ట్ లో టోనీ స్టార్క్ అకా 'ఐరన్ మ్యాన్' పాత్రలో రాబర్ట్ డౌనీ జూనియర్ పాత్ర ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందుతూనే ఉంది. జోన్ ఫావ్‌రూ దర్శకత్వం వహించిన ఈ సినిమా టోనీ స్టార్క్  జీవితాన్ని వర్ణిస్తుంది. మార్వెల్ సూపర్ హీరో 'ఐరన్ మ్యాన్' జీవితకథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 'ఐరన్ మ్యాన్' తర్వాత దాని సీక్వెల్స్ 'ఐరన్ మ్యాన్ 2' , 'ఐరన్ మ్యాన్ 3' వరుసగా 2010, 2013లో విడుదలయ్యాయి. మార్వెల్ అవెంజర్స్ ఫిల్మ్ సిరీస్‌లోనూ రాబర్ట్ డౌనీ జూనియర్ 'ఐరన్ మ్యాన్‌'గా నటించి, గొప్ప పేరు తెచ్చుకున్నారు.


4. జొడాయిక్


2007లో విడుదలైన ఈ చిత్రం హాలీవుడ్‌లో ఇప్పటివరకు రూపొందించిన అత్యుత్తమ క్రైమ్-థ్రిల్లర్‌లలో ఒకటిగా నిలిచింది. డేవిడ్ ఫించర్ రూపొందించిన ఈ సినిమా అపఖ్యాతి పాలైన 'జొడాయిక్' సీరియల్ కిల్లర్ కోసం వెతుకుతున్న పోలీసులు , మీడియా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఈ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్ పాల్ అవేరీ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. తనను తాను ఇబ్బందుల్లోకి నెట్టుకొని కేసులో చిక్కుకుంటాడు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.


5. ట్రోపిక్ థండర్


ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియన్ మెథడ్ యాక్టర్ కిర్క్ లాజరస్ పాత్రను ఎంపిక చేసుకుని రాబర్ట్ డౌనీ జూనియర్ నటనపై తన నిబద్ధతను, ధైర్యాన్ని ప్రదర్శించిన నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ట్రోపిక్ థండర్‌లో లాజరస్‌గా అహంకారి, అజ్ఞాన నటుడిగా రాబర్ట్ అత్యుత్తమ నటనను ప్రదర్శించారు. ఇది మామూలు ప్రేక్షకులతోనే కాకుండా, విమర్శకులచేత కూడా చప్పట్లు కొట్టించుకున్న చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాను మరొక సారి చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.. వెళ్లి వెంటనే చూసేయండి.


Also Read : జీ చేతికి అనుష్క 'శెట్టి' సినిమా - డిజిటల్, శాటిలైట్ రెండూ!