Extraction 2 Movie : ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన క్రిస్ హెమ్స్‌వర్త్ నటిస్తోన్న 'ఎక్స్‌ట్రాక్షన్ 2' సినిమాపై మేకర్స్ ఓ క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. కరోనా కారణంగా అప్పట్లో ఫస్ట్ పార్ట్ ను ఓటీటీలో రిలీజ్ చేయగా.. ఇప్పుడు కూడా మేకర్స్ ఆ పద్దతినే ఫాలో అవుతున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ సిరీస్ ను జూన్ 16న రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. పార్ట్ 1కు ఏ మాత్రం తగ్గకుండా రెండో పార్ట్ కూడా తీర్చిదిద్దడంతో ఈ ట్రైలర్ యాక్షన్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
'అవెంజర్స్' సినిమాతో హాలీవుడ్ ఓ సంచలనం సృష్టించిన క్రిస్ హేమ్స్ వర్త్.. 'థార్' పాత్రలో నటించి, మెప్పించారు. యాక్షన్ సన్నివేశాల్లో తనను మించిన వారెవ్వరూ ఉండరనే విధంగా నటించిన క్రిస్.. 'ఉరుముల దొర'గా ఇండియాలోనూ ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత 2020లో సామ్ హర్‌గ్రేవ్ దర్శకత్వంలో 'ఎక్స్‌ట్రాక్షన్' సినిమాలో హీరోగా తన టాలెంట్ చూపెట్టారు. ఈ సినిమా పార్ట్ 1లో ఎండింగ్ లో క్రిస్ చనిపోయినట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందన్న ఉత్కంఠను కలిగించేలా, మరో పార్ట్ కోసం వెయిట్ చేసేలా మొదటి భాగాన్ని చిత్రీకరించారు.
ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎక్కడైతే ఎండ్ అయిందో... అక్కడ్నుంచే 'ఎక్స్‌ట్రాక్షన్' సీక్వెల్ ను స్టార్ట్ చేస్తున్నట్టు రుస్సో బ్రదర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ ట్రైలర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో జైలులో ఉన్న ఓ యువతిని రక్షించడానికి క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రయత్నించి విఫలమవుతారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లిపోయినట్లుగా చూపించడం ఇంట్రస్టింగ్ పాయింట్ గా నిలుస్తోంది. ఆ తర్వాత తాను ఎక్కడైతే ఓడిపోయాడో అదే ప్రాంతం నుంచి తన పోరాటాన్ని కంటిన్యూ చేసినట్లుగా ఈ ట్రైలర్‌లో అద్భుతంగా చూపించారు.
ఇక ట్రైలర్ చివర్లో మంచు కొండల్లో హెలికాప్టర్‌పై గన్‌తో క్రిస్ హెమ్స్‌వర్త్ ఎటాక్ చేసే సీన్ ట్రైలర్ మొత్తంలోనే స్పెషల్ హైలైట్ గా నిలుస్తోంది. ఆద్యంతం యాక్షన్ అండ్ ఇంట్రస్టింగ్ సీన్స్ తో 2నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. కాగా సోషల్ మీడియాలోనూ దీనికి భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇటీవలే ఈ సినిమా రిలీజ్ పైనా మేకర్స్ ప్రకటన చేశారు. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో జూన్ 16న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also Read : నేనెప్పుడు అన్నాను? - శోభితతో చైతూ డేటింగ్ మీద సమంత క్లారిటీ
ఇదిలా ఉండగా డైరెక్టర్ సామ్ హర్‌గ్రేవ్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతుండడంతో ఈ సినిమాపై అభిమానులు ఇంకా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇంతకుముందు సామ్.. 'మార్వెల్ సూపర్ సిరీస్' సినిమాలతో పాటు 'హంగర్ గేమ్స్' చిత్రాలకు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇక 'ఎక్స్‌ట్రాక్షన్' మూవీ సీక్వెల్ మూడేళ్ల తర్వాత రాబోతుండడంతో యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఆత-ృతగా ఎదురుచూస్తున్నారు.
Also Read : డిసెంబర్ 2026లో ఒకటి, తర్వాత ఏడాది డిసెంబర్‌లో మరొకటి - 'బ్రహ్మాస్త్ర' భారీ విడుదల