గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ 'గేమ్ ఛేంజర్'. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ మూవీకి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్ ని తాజాగా షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగా 'గేమ్ ఛేంజర్' మూవీ నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. తాజాగా పాట ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుపుతూ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది. మరి ఈ పాటలో ఉన్న విశేషాలు ఏంటో తెలుసుకుందాం పదండి. 


జీన్స్ తరువాత మరో రికార్డు 


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్, డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కీయారా అద్వానీ మరోసారి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ల పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2024 సంక్రాంతి సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు 'గేమ్ ఛేంజర్' షూటింగ్ ను పూర్తి చేశారు డైరెక్టర్ శంకర్. ఇక ఈ నేపథ్యంలోనే వరుసగా అప్డేట్స్ ఇచ్చి మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇన్ని రోజులూ అప్డేట్స్ ఇవ్వలేదంటూ శంకర్ పై గుర్రుగా ఉన్న మెగా ఫాన్స్ ను తాజాగా "రా మచ్చా" సాంగ్ అప్డేట్ తో కూల్ చేశారు. ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో శంకర్ ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మధ్య ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడిచింది. దాన్ని బట్టి చూస్తే గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'జీన్స్'లోని 'పూవుల్లో దాగున్న' సాంగ్ తర్వాత ఈ సాంగ్ మరో వింత కానుంది అనిపిస్తోంది. ఆ పాటను అప్పట్లో శంకర్ ఏకంగా ప్రపంచంలోనే ఏడు వింతల దగ్గర షూట్ చేసి చరిత్రను సృష్టించారు. ఇక ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' మూవీ విషయంలో ఇలాంటిదే మరో రికార్డును క్రియేట్ చేయబోతున్నారు. 



Read Also: వర్షంలో తడవకుండా నడిచే వ్యక్తి గురించి తెలుసా? సస్పెన్స్ థ్రిల్లింగ్‌తో భళా అనిపిస్తున్న ‘కలి’ ట్రైలర్!




1. 'గేమ్ ఛేంజర్' సినిమాలోని సెకండ్ సాంగ్ "రా మచ్చా" పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ సీక్వెన్స్ తో దుమ్ము రేపునట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతున్న ఈ పాటను ఇండియాలోని 1000కి పైగా జానపద కళాకారులతో చిత్రీకరించారు డైరెక్టర్. ఈ పాటలో పలు ఇండియన్ కల్చరల్ డాన్స్ లను చూపించినట్టుగా తెలుస్తోంది.


2. భిన్నత్వంలో ఏకత్వం అయిన మన దేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించిన జానపద కళాకారులు ఇందులో భాగమయ్యారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు, వారి సాంప్రదాయ నృత్యాలను ఇందులో భాగం చేశామంటూ తాజాగా శంకర్ తమన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన వీడియోలో వెల్లడించారు. 


3. బాగా రీసెర్చ్ చేసి ఆంధ్రప్రదేశ్ లోని పలు సంస్కృతులను బేస్ చేసుకుని పాటని రూపొందిస్తే బాగుంటుందని శంకర్ డిసైడ్ అయ్యారట. అందులో భాగంగా ఏపీలో కొమ్ము కోయ, తప్పెట గుళ్ళు, గుసాడి వంటి జానపద నృత్యాలను ఈ పాటలో భాగం చేసినట్టుగా తెలుస్తోంది. 


4. వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి. ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేయాల‌నుకుని చాలా రీసెర్చ్ చేసి చేశామని శంకర్ చెప్పుకొచ్చారు. వీటన్నింటినీ బేస్ చేసుకుని చాలా గ్రాండియర్ లుక్ తో పాటను రూపొందించినట్టుగా తెలుస్తోంది. 


5. ఇక రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించడం విశేషం. అయితే ఓ అదిరిపోయే స్టెప్పును చెర్రీ సింగిల్ షాట్ లో పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాట చెర్రీ ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ అవుతుందని అంటున్నారు డైరెక్టర్ శంకర్.


Also Read'దేవర' ఫస్ట్ రివ్యూ: సినిమా చూసిన రాజమౌళి ఫ్రెండ్ - లాస్ట్ అరగంట అదిరిందంతే