సీనియర్ నటుడు తనికెళ్ల భరణి తాజాగా పాన్ ఇండియా స్టార్ యష్ తో కలిసి కనిపించారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తనికెళ్ల భరణి యష్ తో కలిసి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడో చూసేద్దాం పదండి.


యష్ తో తనికెళ్ల భరణి 


కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఇందులో నయనతార కూడా కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. డ్రగ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు సీనియర్ నటుడు తనికెళ్ల భరణి కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. తాజాగా ఆయన టాక్సిక్ సెట్స్  లో యష్ తో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దానికి పెద్దగా క్లారిటీ ఇవ్వకుండా ఆప్యాయంగా ఆయనను పట్టుకొని నిలబడిన ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటోని చూస్తుంటే సెట్స్ లో దిగినట్టుగానే అనిపిస్తుంది. కాగా సోషల్ మీడియాలో తనికెళ్ల భరణిని యష్ తో చూసిన ఆయన అభిమానులు సినిమాలో తనికెళ్ల భరణి కూడా నటిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు స్టార్స్ ఇలాంటి టాలెంటెడ్ నటులను వదిలేసి, పరభాషా నటులపై దృష్టి పెడుతున్నారు అంటున్నారు. ఇక తనికెళ్ల భరణి లుక్ చూస్తుంటే ఆయన ఈ సినిమాలో లాయర్ గా కనిపించబోతున్నట్టుగా అనిపిస్తుంది. 


Read Also : Bigg Boss 8 Telugu: చిల్లర్ ఫెల్లోస్... రెండు క్లాన్ ల మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్ - నేడు ఏం జరుగుతుందో?


భార్యతో కలిసి డిన్నర్ డేట్ 


రాకింగ్ స్టార్ యష్ సెప్టెంబర్ 25న బుధవారం రాత్రి ముంబైలో ఇదే డ్రెస్ తో కనిపించాడు. తనికెళ్ళ భరణితో కలిసి దిగిన లుక్ లోనే ఆయన రెస్టారెంట్ దగ్గర కూడా కన్పించారు. దీన్నీబట్టి చూస్తుంటే టాక్సిక్ షూటింగ్ ముంబైలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కాగా యష్ తన భార్య రాధికా పండిట్ తో కలిసి ముంబైలో ఉన్న ఓ పాపులర్ రెస్టారెంట్ బయట కెమెరా కంటికి చిక్కారు. ఈ సెలబ్రిటీ కపుల్ సరదాగా డిన్నర్ డేట్ కు వెళ్ళినట్టు సమాచారం. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది అంటూ ప్రచారం జరుగుతుంది.


రామాయణంతో బిజీ బిజీ 


కేజీఎఫ్ స్టార్‌గా ఓవర్ నైట్ పాన్ ఇండియా హీరో అయిపోయిన యష్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సిక్ తరువతా ఆయన ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'రామాయణం'లో కనిపించనున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్, దక్షిణాది సినీ బ్యూటీ సాయి పల్లవి ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ గోవిల్, లారా దత్తా, రవి దూబే తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కన్పించనున్నారు. ఈ మూవీకి యష్ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు రావణుడిగా కన్పించబోతున్నాడు. ఈ సినిమా 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.


read also : బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ లిస్ట్.. ఆ నలుగురు కన్ఫామ్ అట