Prince Kali Movie Trailer Released: యువ నటుడు ప్రిన్స్, నరేష్ అగస్త్య ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కలి’. ఈ సినిమాకు శివ శేషు దర్శకత్వం వహిస్తున్నారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదల అయ్యింది.


ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నన ట్రైలర్


‘కలి’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో ఓ రేంజ్‌లో క్యూరియాసిటీ పెంచుతోంది. శివరామ్ (ప్రిన్స్) మంచి వ్యక్తిత్వం ఉన్న యువకుడు. తన మంచి తనం వల్లే ఇబ్బందులు పడుతుంటాడు. “నువ్వు మంచి వాడివి. కానీ, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలో తెలియదు” అంటూ భార్య తన బిడ్డను తీసుకుని వెళ్లిపోతుంది. ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకోవాలి అనుకుంటాడు. ఆ రోజు నైట్ ఓ గుర్తు తెలియని వ్యక్తి (నరేష్ అగస్త్య) శివరామ్ ఇంటికి వస్తాడు. ఇంతకీ అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? శివరామ్ జీవితాన్ని ఎటువంటి మలుపు తిప్పుతాడు? ఆ తర్వాత శివరామ్ జీవితంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి? అనే విషయాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.


ట్రైలర్‌లో ప్రియదర్శి వాయిస్ ఫన్నీగా ఆకట్టుకుంది. “మనిషి పుట్టడంతోనే జీవితం అనే శత్రువును వెంటేసుకుని మరీ పుడతాడు. దాని మీద గెలిచినోడే గొప్పోడు అవుతాడు. ఓడినోడు మధ్యలోనే...” అనే డైలాగ్ సినిమాలోని డెప్త్ ను సూచిస్తోంది. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను అద్భుతంగా అలరించనున్నట్లు అర్థం అవుతోంది 



సినిమా చూసేందుకు ఎదురుచూస్తున్నా- ప్రశాంత్ వర్మ


‘కలి’ సినిమా ట్రైలర్ విడుదల చేసిన ప్రశాంత్ వర్మ... యూనిట్ సభ్యుల మీద ప్రశంసల జల్లు కురిపించారు. “‘కలి’ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ట్రైలర్ థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఇదొక గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా సినిమా ఉండబోతున్నట్లు అర్థం అవుతోంది. టీమ్ అంతా మంచి ఎఫర్ట్స్ పెట్టి చేశారు. వీఎఫ్ఎక్స్ హై క్వాలిటీతో ఉన్నాయి. లీడ్ యాక్టర్స్ ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్ బాగా నటించారు. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. ‘కలి’ మూవీ చూసేందుకు నేనూ వేయిట్ చేస్తున్నా” అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు.


అక్టోబర్ 4న ‘కలి’ విడుదల


Kali Movie Release Date: ‘కలి’ సినిమా అక్టోబర్ 4న విడుదలకానుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ కథా రచయిత కె రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో  రుద్ర క్రియేషన్స్  సంస్థ నిర్మిస్తోంది. నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి ఇతర పాతలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నిశాంత్ కటారి, రమణ జాగర్లమూడి సినిమాటోగ్రఫీ అందించగా, జీవన్ బాబు సంగీతం అందించారు. విజయ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. రామ జోగయ్యశాస్త్రి పాటలు రాశారు.  


Read Also: ఓటీటీలో ఇవాళ సందడే సందడి... 5 సినిమాలు విడుదల, అందులో ఈ మూడూ వెరీ వెరీ స్పెషల్