Rajamouli Car Cost: కారు అంటే ప్రయాణానికి ఉపయోగించే సాధారణ వాహనం కాదు, స్టేటస్‌కు సింబల్. అందుకే, కారును బట్టి వారి స్థాయిని అంచనా వేసేయొచ్చు. వాణిజ్య వేత్తల నుంచి బడా బడా స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ తమ హోదాకు తగిన కార్లను వినియోగిస్తారు. అవి కొన్ని లక్షల నుంచి రూ.కోట్లు విలువ చేస్తాయి. మరి, పాన్ ఇండియా సినిమాలతో యావత్ దేశాన్నే ఆకట్టుకున్న దర్శక ధీరుడు రాజమౌళి.. ఇప్పుడున్న దర్శకులు అందరికంటే రిచెస్ట్. అంత డిమాండ్ ఉన్న రాజమౌళి సాధారణ కార్లతో తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి. పైగా, ఆయన మన హీరోలతో కూడా అప్పుడప్పుడు షికారు చేస్తుండాలి. అందుకే, అన్ని హంగులు కలిగిన సౌకర్యవంతమైన కారులో ప్రయాణిస్తారు. అదే.. టయోటా వెల్‌ఫైర్ (Toyota Vellfire). ఇది పూర్తిగా లగ్జరీ MPV కారు.
Toyota Vellfire కారును అక్కినేని నాగ చైతన్య కూడా వినియోగిస్తున్నాడు. రాజమౌళి, నాగ చైతన్య కార్లు రెండు బ్లాక్ కలరే. ఇటీవల చైతూ తన కారుకు ఫుల్ బ్లాక్ ఫిల్మ్ ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ పోలీసులకు జరిమానా కట్టాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయ నేతల నుంచి సినీ స్టార్ల వరకు ఈ కారునే ఇష్టపడటానికి గల కారణాలను మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మరి, ఈ కారు ప్రత్యేకతలు తెలుసుకుందామా.
⦿ టయోటా వెల్‌ఫైర్ కారు భారత దేశంలోనే అత్యంత విలాశవంతమైన కారు(MPV).
⦿ ఈ కారు ఎంతో విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
⦿ ఈ కారులో మొత్తం మూడు వరుసల్లో సీట్లు ఉంటాయి. ఇవి ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లో ఉండే ఛైర్మలను తలపిస్తాయి.
⦿ ఈ కార్లలోని సీట్లు వెనక్కి కదులుతాయి. అలాగే కాళ్లను రిలాక్స్‌గా పెట్టుకొనేందుకు కూడా ఏర్పాట్లు ఉన్నాయి.
⦿ Vellfireలోని డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 2వ వరుసలో సీట్లలో స్ప్లిట్ సన్‌రూఫ్, ఆర్మ్‌రెస్ట్, సాఫ్ట్ రీడింగ్ లైట్, సీట్ పొజిషన్‌లను సర్దుబాటు చేయడానికి రిమోట్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
⦿ వెనుక ప్రయాణీకుల ఎంటర్‌టైన్మెంట్ కోసం స్క్రీన్, JBL ఆడియో సిస్టమ్, ప్రైవసీ స్క్రీన్‌లు ఉన్నాయి.
⦿ బూట్(డిక్కీ)లో లగేజీ కోసం అదనపు స్థలాన్ని పొందడానికిమూడవ వరుస సీట్లను పూర్తిగా మడిచివేయొచ్చు.
⦿ ఈ కారు విశాలంగా ఉండటం వల్ల ప్రయాణికులకు తగినంత లెగ్‌రూమ్, హెడ్‌రూమ్, లంబార్ సపోర్ట్‌ను లభిస్తుంది.
⦿ కేవలం లగ్జరీలోనే కాదు సేఫ్టీలోనూ ఈ కారుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
⦿ ప్రమాదం జరిగినప్పుడు లోపల ఉన్నవారిని సురక్షితంగా ఉంచడానికి ఇందులో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.
⦿ ABS, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్‌లు.. పానిక్ బ్రేకింగ్ పరిస్థితులలో సహాయపడతాయి. ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ కూడా ఈ కారులో ఉంది.
⦿ వ్యాన్‌ను తలపించే ఈ కారును పార్క్ చేయడం కూడా సులభమే. ఇందుకు పార్కింగ్ సెన్సార్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు
⦿ ఈ కారు సెల్ఫ్ -ఛార్జింగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
⦿ Vellfire కారు మొత్తం పొడవు 4935mm, వెడల్పు 1850mm, ఎత్తు 1895mm.
⦿ ఇది DRLలతోపాటు ఆటోమేటిక్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉంటాయి.
⦿ ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు ఈ కారు ప్రత్యేకత. చిన్న బటన్ నొక్కితే చాలు కారు డోర్లు వాటికవే తెరుచుకుంటాయి.
⦿ ఇక డ్రైవింగ్ విషయానికి వస్తే.. ఒక్కసారి స్టిరింగ్ పట్టుకుంటే చాలు, ఆ కారుతో ప్రేమలో పడిపోతారు.
⦿ ఈ కారు 4 సిలిండర్స్, 2494 సీసీ సామర్థ్యంతో నడుస్తుంది. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 58 లీటర్లు.
⦿ ఇది ఎలక్ట్రిక్ + పెట్రోల్‌తో నడిచే హైబ్రిడ్ కారు. మైలేజీ లీటర్‌కు 16.35 కిమీలు వరకు ఇస్తుందట.
⦿ ఈ కారు ఎక్స్‌షోరూమ్ ధర రూ.87 లక్షల నుంచి రూ.90 లక్షల వరకు ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ కలిపితే రూ.1.11 కోట్లు వరకు ధర పలుకుతుంది.
Also Read: మహేష్ ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్- ఒక్క పాట పూర్తైతే చాలు పండగే