సినిమా తారలు బ్రాండ్ ప్రమోషన్ చేయడమనేది కామనే. స్టార్ హీరో, హీరోయిన్లు ఎన్నో యాడ్ షూట్స్ చేస్తూ.. బాగా సంపాదిస్తున్నారు. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏకంగా మద్యం, కండోమ్ యాడ్స్ ను ప్రమోట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పూజాహెగ్డే, కాజల్ లాంటి స్టార్ హీరోయిన్స్ మందు బ్రాండ్స్ కి అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
రీసెంట్ గా నిధి అగర్వాల్ అయితే కండోమ్ యాడ్ ను ప్రమోట్ చేస్తూ షాకిచ్చింది. కండోమ్స్ గురించి ఆమె వివరించడంతో నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఇప్పుడు అదే కండోమ్ యాడ్ ను మరో హీరోయిన్ ప్రమోట్ చేయడం వైరల్ అవుతోంది. తెలుగులో 'నువ్వు నేను', 'తొట్టి గ్యాంగ్', 'నిన్నే ఇష్టపడ్డాను' లాంటి సినిమాల్లో నటించిన అనిత.. ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
అక్కడ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన భర్తతో కలిసి కండోమ్ యాడ్ ను ప్రమోట్ చేస్తూ కనిపించింది. ఆ కండోమ్స్ తో ఇంటెన్స్ ప్లెజర్ ఉంటుందని అనిత చెప్పడం, భార్యాభర్తల చాట్ తో ఆ వీడియోను రూపొందించారు. ఆ కండోమ్ తో అద్భుతమైన అనుభవం అన్నట్లుగా మహిళలకు సూచిస్తోంది అనిత. అంతేకాకుండా.. ఆ కండోమ్ టెలివిజన్ కమర్షియల్ ను కూడా అనిత ఆ తరువాత తన అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రోమోలో కనిపించడంతో పాటు.. యాడ్ ను తన సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ఆమెకి భారీ రెమ్యునరేషన్ అందిందని సమాచారం.
Also Read: తెలంగాణలో 'కెజియఫ్ 2' టికెట్ రేట్స్ పెరిగాయ్, రోజుకు ఐదు షోలు