Chinmayi Sripada: న్యూడ్ ఫోటోలు పంపిన మగవాళ్ళే - చిన్మయి ఇన్‌స్టా అకౌంట్ డిలీట్
Chinmayi Instagram Account Blocked: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద అకౌంట్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసింది. బ్లాక్ చేయడం కాదు... డిలీట్ చేసింది. దీనికి కారణం కొంత మంది నెటిజనులు ఆమె అకౌంట్‌ను రిపోర్ట్ చేయడమే. అసలు వివరాల్లోకి వెళితే...
చిన్మయి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు... సోషల్ మీడియా వేదికగా మన సమాజంలో అమ్మాయిలు, మహిళలకు ఎదురవుతున్న పలు సమస్యల మీద గళం వినిపించే వనిత. వరకట్న వేధింపుల నుంచి సెక్స్యువల్ హెరాస్‌మెంట్ వరకూ తమకు ఎదురైన చేదు అనుభవాలను పైకి చెప్పుకోలేని మహిళలకు ఆమె ఓ గొంతు అయ్యారు. అందువల్ల, తనను చాలా మంది ట్రోల్ చేస్తున్నారని చిన్మయి కొంత కాలంగా చెబుతూ వస్తున్నారు.
Also Read : 'కొండా' రివ్యూ: కొండా మురళి, సురేఖ దంపతుల జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఎలా ఉందంటే?
Chinmayi Instagram Account Deteled: అబ్బాయిలు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేస్తున్నారని ఇన్‌స్టాగ్రామ్‌కు కంప్లయింట్ చేశానని గతంలో చిన్మయి తెలిపారు. అయితే... చాలా మంది అబ్బాయిలు ఆమె అకౌంట్‌ను రిపోర్ట్ చేయడం వల్ల ఇన్‌స్టా యాజమాన్యం డిలీట్ చేసినట్టు చిన్మయి చెప్పిన మాటలను బట్టి తెలుస్తోంది. ''నాకు న్యూడ్ ఫోటోలు మెసేజ్ చేసిన మగవాళ్ళు రిపోర్ట్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్ నా అకౌంట్ డిలీట్ చేసింది'' అని ఆమె ట్వీట్ చేశారు. బ్యాకప్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వివరాలు కూడా ఇచ్చారు.
Also Read : అల్లు అర్జున్‌కు వీరాభిమాని అరుదైన కానుక - ఐకాన్ స్టార్ అభిమానులే ఖర్చులన్నీ భరించి