Akash Puri Kiran Abbavaram: చిరుత నుంచి ట్రై చేస్తే ఇప్పటికి కుదిరింది - ఫన్నీగా విష్ చేసుకున్న కిరణ్ అబ్బవరం, ఆకాష్ పూరి!

యువ హీరోలు కిరణ్ అబ్బవరం, ఆకాష్ పూరి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Continues below advertisement

యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘సమ్మతమే’, ఆకాష్ పూరి నటించిన ‘చోర్ బజార్’ సినిమాలు శుక్రవారం (జూన్ 24వ తేదీ) విడుదలకు సిద్ధం అయ్యాయి. ఈ సందర్భంగా హీరోలు ఇద్దరూ ఒకరికి ఒకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Continues below advertisement

‘మనం ముందే కలిసి కూర్చుని మాట్లాడుకుంటే క్లాష్ తప్పేది’ అని ఆకాష్ పూరి అంటే ‘చిరుత నుంచి ట్రై చేస్తే ఇప్పటికి దొరికావ్ బ్రో...’ అని కిరణ్ అబ్బవరం అంటాడు. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అంతా పూర్తిగా ఇలాగే సరదాగా ఉంది.

సమ్మతమే సినిమాలో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించారు. గోపినాథ్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇక చోర్ బజార్ విషయానికి వస్తే... ఈ సినిమాలో ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా నటించారు. జార్జి రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు.

Continues below advertisement